Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేట‌ర్‌లోకి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుందరాంగుడు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (15:56 IST)
Krishnasai, Mauryani
తెలుగు సిల్వ‌ర్‌స్క్రీన్‌ పైకి ఓ సూప‌ర్ లవ్ ఆండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎం ఏస్. కె ప్రమిద ఫిలిమ్స్ బ్యానర్ లో కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘సుందరాంగుడు’. ఏవీ సుబ్బారావు సమర్పణలో చందర్‌ గౌడ్, యం.యస్‌.కె. రాజు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 17 న  ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ సినిమా హైలైట్స్ తెలిపింది. 
 
కృష్ణ సాయి మాట్లాడుతూ.. ‘‘నేను, చంద్ర గౌడ్‌గారు రెండేళ్లు కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాం. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేస్తున్నాం అన్నారు. కృష్ణసాయి, మౌర్యాని కాంబినేషన్ లో వచ్చే సాంగ్స్, సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. అంతేకాకుండా రామోజీఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు, కామెడీ.. సుందరాంగుడు చిత్రానికి ప్రధానాకర్షణ అని అన్నారు. ఇటీవల సుందరాంగుడు ప్రివ్యూ చూసిన సినీపెద్దలు , సెన్సార్ అధికారులు చిత్రయూనిట్ ను ప్రశంస‌లు కురిపించారు. డిసెంబర్ 17 విడుదల అవుతున్న మా సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.. మా ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్‌ ట్రస్ట్‌’ తరఫున చాలామందికి సాయం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా వచ్చే డబ్బుని ట్రస్ట్‌ కోసమే ఖర్చు చేయాలనుకుంటున్నాం.. అని తెలిపారు.
 
జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్, మ్యూజిక్: సిద్ధబాబు  కొరియోగ్రాఫర్ : నిక్సన్ పాల్ ,సూర్య కిరణ్ ,అనీష్ ,రవి కృష్ణ, కెమెరా: వెంకట్ హనుమాన్, 
ఎడిటింగ్: నందమూరి హరి,  నిర్మాతలు: బీసు చందర్ గౌడ్‌ - MSK రాజు, 
దర్శకత్వం: వినయ్ బాబు. పి.ఆర్‌.ఓ : దయ్యాల అశోక్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments