Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివకార్తికేయన్ మెరీనా ఆగమనం

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (15:47 IST)
Sivakarthikeyan, Oviya
తమిళ ప్రేక్షకులకే కాదు  తెలుగు వాళ్లకు దగ్గరైన కథానాయకుడిగా శివకార్తికేయన్ కు గుర్తింపు ఉంది. ఆయన  నటించిన "మెరీనా" చిత్రం తెలుగులో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇందులో శివకార్తికేయన్ సరసన ఒవియా నాయికగా నటించింది. పలు హిట్ సినిమాలను రూపొందించిన పాండిరాజ్ దర్శకత్వం వహించగా, ఎస్.వి .ఆర్ మీడియా (ప్రై ) లిమిటెడ్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్రీమతి సి.జె.శోభ ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత సి.జె.శోభ మాట్లాడుతూ, ఈ నెల 17న సినిమాను విడుదల చేయబోతున్నాం. చక్కటి కామెడీ డ్రామాతో ఆద్యంతం అలరింపజేసే ఈ సినిమాలో హీరోహీరోయిన్లు తమ తమ పాత్రలకు  ప్రాణం పోశారు. 
 
తమిళంలో రెండు స్టేట్ ఫిలిం అవార్డులతో పాటు  ప్రేక్షకుల రివార్డులను పొందింది. కనువిందుచేసే ఛాయాగ్రహణం ఒక హైలైట్ అయితే సంగీతం మరో హైలైట్. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేట్ కు ఎక్కువ డబ్బు పెట్టి కొన్నాం. థియేట్రికల్ రిలీజ్ విషయంపై మంచి పట్టున్న నట్టి కుమార్ వారి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాను విడుదల చేస్తున్నారు" అని అన్నారు.
 
తెలుగులో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను పంపిణీ చేస్తున్న నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ, "అనేక అద్భుత చిత్రాల సృష్టికర్త పాండిరాజ్ దీనిని మలచిన విధానం జనాన్ని థియేటర్లకు రప్పిస్తుంది. తప్పకుండా మా అంచనాలను నిలబెడుతుంది. ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం. పాటలను కూడా  ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కరించబోతున్నాం" అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments