Sivakarthikeyan, Maria Ryaboshapka,
తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు.
సాంకేతిక విభాగం- రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి, సంగీతం: ఎస్ థమన్, నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు, బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్, సమర్పణ: సోనాలి నారంగ్, సంగీతం: ఎస్ థమన్, డీవోపీ: మనోజ్ పరమహంస, సహ నిర్మాత: అరుణ్ విశ్వ, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ : నారాయణ రెడ్డి
వరుణ్ డాక్టర్ సినిమాతో తెలుగువారికి బాగా తెలిసిన శివకార్తికేయన్ ప్రిన్స్ చిత్రంతో ఈరోజే ముందుకు వచ్చాడు. విదేశీ యువతి ప్రేమలో స్వదేశీయుడు పడితే ఎలా వుంటుందనేది పాయింట్ అని విడుదలకుముందు చెప్పాడు. ఇందులో సీనియర్ నటీనటులు, సాంకేతిక సిబ్బంది పనిచేశారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ
విశ్వనాథం (సత్యరాజ్) కుల మతాలకు అతీతంగా వుండే వ్యక్తి. అన్నీ తనకే తెలుసుని అనుకునే వాడు కూడా. జాతీయాభిమానం ఎక్కువ. ఆ ఊరిలో స్కూల్ టీచర్ గా వర్క్ చేసే ఆనంద్ (శివకార్తికేయన్) ఆయన కుమారుడు. సోషల్ టీచర్ అయినా తండ్రిలాగే అన్నీ తెలుసుఅనుకేవాడు. స్కూల్ లోనే టీచర్ గా జాయిన్ అయిన జెస్సిక (మరియా ర్యాబోషప్కా)ను మొదటిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈమె జర్మనీ దేవశస్తురాలు. వీరి ప్రేమను ఇరువైపుల పెద్దలు ఒప్పుకోరు. మరోవైపు జెస్సిక తండ్రి ఇక్కడ ఆస్తుల్ని అమ్ముకుని వెళ్ళిపోయాలనుకుంటాడు. అలాంటి సమయంలో ఇద్దరూ పెద్దల్ని ఎలా ఒప్పించారనేది కథ.
విశ్లేషణః
ఇది ఇండియా, పాక్లిస్తాన్, జర్మనీ, ఇండియా యుద్ధాల నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ, వారి వారసులు ఇప్పటి జనరేషన్ అనేలా హీరో హీరోయిన్లను చూపించారు. హీరోయిన్ బామ్మ ఇండియా గురించి గొప్పగా చెబుతూ, తమ దేశంనుంచి యుద్ధం వల్ల పారిపోయి వచ్చామనే సన్నివేశాలో ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సన్నివేశాలను చూపించారు.
- తన తాతను చంపిన వాళ్ళు ఇంగ్లీషువాళ్ళు అని ఆనంద్ తండ్రి వీరి పెండ్లికి వ్యతిరేకంగా వుండడంతోపాటు, ఇండియన్స్ ఆర్ కరెప్టెడ్ అనే భావనలో హీరోయిన్ తండ్రి వుండడం.. వీరిద్దరి భావాలను ఏవిధంగా మలిచారనేది సినిమాలో పాయింట్. మిగిలిన సన్నివేశాలు అన్నీ కామెడీ సినిమాకు కావాల్సిన హంగులు అద్దినట్లుంది. హీరో, సత్యరాజ్ మధ్య జరిగే సన్నివశాలతోపాటు, ఊరి వారితో మెలిగే సన్నివేశాలు కాస్త మోతాదు ఎక్కువయినట్లుగా అనిపిస్తాయి.
- హీరో పాత్రలో అతని అమాయకత్వం చూసి జెస్సిక ప్రేమలో పడుతుంది. ఫ్యామిలీతో ఇంగ్లండ్ కు తిరిగి వెళ్లిపోవాలి అనుకున్న జెస్సిక తండ్రికి భూపతి (ప్రేమ్ కుమార్ గంగై అమరెన్) నుంచి ఒక ఇబ్బంది ఎదురవుతుంది. ఇక ఆ సమస్య జెస్సిక, ఆనంద్ ల ప్రేమ పై ప్రభావం చూపిస్తుంది
-= శివకార్తికేయన్ కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా జెస్సిక స్కూల్ టీచర్ గా అతను చిన్న పిల్లల క్లాస్ లలో చూపించిన హావభావాలు నవ్విస్తాయి. క్లైమాక్స్ లో శివకార్తికేయన్ డైలాగ్స్ తో ఒకవైపు ఆలోచింపజేస్తూనే మరోవైపు నవ్విస్తాయి.జాతిరత్నాలు సినిమాతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అంధించిన దర్శకుడు అనుదీప్ ఈసారి ప్రిన్స్ కథను మూడు విభిన్న కోణాల్లో టచ్ చేశాడు. ఒకవైపు కామెడీ మరోవైపు లవ్ స్టొరీ.. అలాగే హ్యూమనీటి అనే అంశాన్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశాడు.
- ఇండియన్స్‌లో మానవీయకోణం చాలా వుంది. అదే ఎక్కడివారినైనా అక్కున చేర్చుకుంటుందనే పాయింట్ దర్శకుడు హైలైట్ చేశాడు. థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు తగ్గట్టుగా సెట్టయ్యాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా లవ్ సీన్స్ ను హైలెట్ చేశాయి. సినిమా పై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే చూడవచ్చు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ అనుకుని వెళి అలా వుండాలనుకుంటే నిరాశే అవుతుంది.