మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ హీరోగా పరిచయం కావడం తెలిసిందే. తాజాగా చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. సాయి కొర్రపాటి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. ఎవరంటారా..? సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.
నేల టిక్కెట్టు నిర్మాత రామ్ తాళ్లూరి వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు దర్శకుడు సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత రామ్ తాళ్లూరి సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేయనున్నట్టు సమాచారం.