Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ వేసవిలోనే సిద్ధమవుతోన్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో

Webdunia
గురువారం, 18 మే 2023 (18:15 IST)
Susha, lavanya and others
పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి వైవిధ్యమైన సినిమాలతో బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో వస్తోన్న 6వ చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఇచ్చట అందమైన ఫోటోస్ తీయబడును అనేది ఉపశీర్షిక. చెందు ముద్దు దర్శకత్వంలో.. 30వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు లావణ్య జంటగా నటించిన సినిమా. గతంలో విడుదలైన ఈ మూవీ మోషన్ పోస్టర్ తోపాటు రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు సుహాస్ చేతుల మీదుగా మరో పాటను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. "అన్నపూర్ణ ఫోటో స్టూడియో నుంచి పాట లాంచ్ చేశాం. నా చేతుల మీదుగా ఒక పాట విడుదల కావడం ఇదే ఫస్ట్ టైమ్. పాట చాలా బావుంది. తక్కువ బడ్జెట్ అయినా.. హై క్వాలిటీ విజువల్స్ ఉన్నాయి. హీరో చైతన్య, చెందు ముద్దుతో పాటు మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను.."  అలాగే నిర్మాత యష్ గారికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
 
దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. మొదటగా వచ్చే పాట ఇది. సినిమాలో ఊరికీ ఓ పాత్ర ఉంటుంది. ఆ ఊరి పాత్రను ఎస్టాబ్లిష్‌ చేస్తూ సాగే పాట ఇది. ఆ ఊరు ఎలాంటిది.. అక్కడి మనుషులు ఎలాంటివాళ్లు అనేది ఈ పాటలో కనిపిస్తుంది. ఈ పాటకు ప్రిన్స్ హెన్రీ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ ట్యూన్ కు తగ్గట్టుగా మంచి లిరిక్స్ ఇచ్చాడు శ్రీనివాస్ మౌళి. పంకజ్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది మా నిర్మాత యష్ గారికి చాలా థాంక్స్ అన్నారు.
 
హీరో చైతన్య రావు మాట్లాడుతూ... " మా సినిమాలో మొదటగా వచ్చే ఈ పాట సుహాస్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. మేమిద్దరం చాలాకాలంగా ఫ్రెండ్స్. తను నటించిన అంబాజీ పేట పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సుహాస్ కు థ్యాంక్స్. ఈ పాటను మౌళిగారు అద్భుతంగా రాశారు. మంచి ట్యూన్ కుదిరింది.అందరికీ థ్యాంక్యూ సో మచ్ అలాగే మా యష్ గారు ప్రమోషన్స్ బాగా ప్లాన్ చేసారు  అన్నారు.
 
హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. " అన్నపూర్ణ ఫోటో స్టూడియోనుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ చేసినందుకు సుహాస్ గారికి థ్యాంక్స్. ఇంతకు ముందు వచ్చిన రెండు పాటలను బాగా ఆదరించారు. అలాగే ఈ పాట కూడా మీ అందరికీ అంతే బాగా నచ్చుతుంది. ఒక మంచి ట్యూన్ కు తగ్గట్టుగానే మంచి లిరిక్స్ కూడా కుదిరాయి. డివోపి పంకజ్ గారు, డైరెక్టర్ చందు మరియు నిర్మాత యష్ గారికి థ్యాంక్స్ యూ.." అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ.. " పాట విడుదల చేసిన సుహాస్ గారికి థ్యాంక్యూ. ఒక మంచి అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ గారికి థ్యాంక్యూ. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండే పాట ఇది.అలాగని రెగ్యులర్ ఫోక్ సాంగ్ లా ఉండదు. అందుకు తగ్గట్టుగా మౌళిగారు మంచి సాహిత్యం రాశారు. సాయి చరణ్‌ అంతే బాగా పాడారు. అన్ని రకాలుగా ది బెస్ట్ ఇచ్చాం. మీరు విని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడ రేషన్ బియ్యం మాఫియా.. పవన్ జోక్యం.. షిప్ సీజ్‌పై కసరత్తు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142కోట్ల నిధులు.. కేంద్రం ఆమోదం..

ఫెంగల్ తుఫాను-తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

కాకినాడ ఓడరేవు భద్రతపై పవన్ ఆందోళన.. పురంధేశ్వరి మద్దతు

పార్వతీపురంలో అక్రమ మైనింగ్.. ఆపండి పవన్ కళ్యాణ్ గారూ..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments