Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజలి హార్ర‌ర్ మూవీకి ఓకే చెప్పింది, టైటిల్ ఏంటో తెలుసా..?

ఇటీవ‌ల కాలంలో హ‌ర్ర‌ర్ మూవీస్‌కి ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. భాష ఏదైనా కానీ.. హ‌ర్ర‌ర్ మూవీ అంటే మినిమ‌మ్ గ్యారంటీ అనే న‌మ్మ‌కాన్ని నిర్మాతల‌కు క‌లిగించింది. అందుక‌నే హ‌ర్ర‌ర్ మూవీస్ చేయ‌డానికి ఇటు ఆర్టిస్టులు అటు నిర్మాత‌లు ఆస‌క్తి చూ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (19:37 IST)
ఇటీవ‌ల కాలంలో హ‌ర్ర‌ర్ మూవీస్‌కి ప్రేక్ష‌కుల నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. భాష ఏదైనా కానీ.. హ‌ర్ర‌ర్ మూవీ అంటే మినిమ‌మ్ గ్యారంటీ అనే న‌మ్మ‌కాన్ని నిర్మాతల‌కు క‌లిగించింది. అందుక‌నే హ‌ర్ర‌ర్ మూవీస్ చేయ‌డానికి ఇటు ఆర్టిస్టులు అటు నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరో సిద్ధార్థ్ మూడు భాషల్లో విడుదల చేసిన హార్ర‌ర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూడు భాషల్లోను ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. ఈ క్రమంలోనే అంజలి కథానాయికగా ఒక హార్ర‌ర్ మూవీ రూపొందుతోంది.
 
తెలుగు.. తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి 'లిసా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషలపై అంజలికి మంచి పట్టు వుంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతేకాకుండా గతంలో ఆమె న‌టించిన‌ 'గీతాంజలి అనే హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఇక లిసా మూవీని త్రీడీ హార్ర‌ర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా రాజు విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మ‌రి... గీతాంజ‌లి వ‌లే లిసా కూడా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments