Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్సకుడు తేజ వెంటపడ్డ హీరో సునీల్.. ఎందుకో తెలుసా?

సునీల్‌ను హీరోగా కన్నా కమెడియన్‌గా ఆదరించేవాళ్ళే ఎక్కువ. లావుగా, తమాషా కామెంట్లతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వ్యక్తి సునీల్. కమెడియన్ కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన వ్యక్తిలో సునీల్ ఒకరు. కానీ సునీల్‌కు మాత్రం హీరోగా పెద్ద అవకాశాలేమీ రాలేదు. అడపాదడప

Webdunia
మంగళవారం, 22 మే 2018 (19:27 IST)
సునీల్‌ను హీరోగా కన్నా కమెడియన్‌గా ఆదరించేవాళ్ళే ఎక్కువ. లావుగా, తమాషా కామెంట్లతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన వ్యక్తి సునీల్. కమెడియన్ కెరీర్ ప్రారంభించి హీరోగా ఎదిగిన వ్యక్తిలో సునీల్ ఒకరు. కానీ సునీల్‌కు మాత్రం హీరోగా పెద్ద అవకాశాలేమీ రాలేదు. అడపాదడపా రెండుమూడు సినిమాలు హిట్లు అయ్యాయి. కానీ ఆ తరువాత అన్నీ ఫ్లాప్‌లే. సిక్స్ ప్యాక్‌తో లావుగా కండలు తిరిగిన సునీల్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు.
 
ఇప్పటికే హీరోగానే కాకుండా కమెడియన్‌గా కూడా చేస్తానని ప్రకటించాడు సునీల్. సునీల్ చెప్పాడు కానీ అవకాశాలు మాత్రం అస్సలు ఆయనకు రావడం లేదు. ఎందుకంటే సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి.. హీరోగా సరిపోయే వ్యక్తికి ఎలా కమెడియన్ క్యారెక్టర్ ఇస్తామంటున్నారు దర్సకులు. దీంతో సునీల్ ఇక చేసేది లేక తనకు సినీపరిశ్రమలో బాగా పరిచయం ఉన్న డైరెక్టర్ తేజ వెంటపడ్డాడట. 
 
నాకు హిట్ సినిమా కావాలి. హీరోగానే కాకుండా కామెడీ కూడా అందులో ఉండాలి. ప్రేమకథా చిత్రానికి కూడా నేను సరిపోతాను.. అంటూ తేజను ఒప్పించాడట సునీల్. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కూడా తెరకెక్కుతున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద తేజపై సునీల్ పెట్టుకున్న నమ్మకం ఎంతమాత్రం ఫలిస్తుందో చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments