Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-3 కోసం అనిల్ రావిపూడి సన్నాహాలు.. వెంకీ మాత్రం?

Webdunia
శనివారం, 23 మే 2020 (15:55 IST)
దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్-3 సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమా చేసిన తర్వాత ఎఫ్-3 చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన హిట్ చిత్రం 'ఎఫ్ 2'కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కనుంది. గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూర్తి స్క్రిప్టును కూడా దర్శకుడు ఇప్పటికే సిద్ధం చేశాడు. 
 
ప్రస్తుతం వెంకటేశ్ చేస్తున్న 'నారప్ప' చిత్రం తర్వాత దీనిని సెట్స్‌కి తీసుకు వెళదామని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడీ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టుగా వార్తలొస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇప్పుడీ చిత్రం షూటింగ్ ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి షూటింగులు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. 
 
అయితే వెంకటేష్ మాత్రం అప్పుడే షూటింగ్‌లో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది. 'నారప్ప' కోసం మూడు నెలలు గడిచిన తర్వాతే ఎఫ్-3 షూటింగ్‌‌లో జాయిన్ అవుతారని, అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో 'ఎఫ్ 3' చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయించుకున్నారట. మరి, ఈ గ్యాప్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఏం చేస్తారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments