Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

దేవీ
గురువారం, 27 నవంబరు 2025 (14:38 IST)
Andhra King Taluka new poster
నటీనటులు: రామ్, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, మురళీ శర్మ, రావు రమేష్, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల,  హర్షవర్ధన్, తులసి, రఘుబాబు తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం: సిద్దార్థ్ నూని, సంగీతం: వివేక్- మెర్విన్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని- యలమంచిలి రవిశంకర్, రచన-దర్శకత్వం: మహేష్ బాబు.పి
 
కథ:
ఇది 2000 సంవత్సరానికి ముందు కథ. అది గోదావరి జిల్లాలో కరెంట్ లేని ఓ లంక గ్రామం. పక్క ఊరుకు ఏదికావాలన్నా పడవ మీద రాావల్సిందే. సాగర్ (రామ్) తండ్రి ఆర్మోనిస్టు. చదువుకు దూరంగా వుండే వారంతా బతుకుతెరువుకోసం పక్క ఊరిలో పనిచేయాల్సిందే. సూర్య (ఉపేంద్ర)కు సాగర్ పెద్ద అభిమాని. తను చిన్నతనంలో ఆంధ్రా కింగ్ అనే పేరు పెట్టి బేనర్లు కట్టడంతో ఆయన ఫ్యాన్స్ అధ్యక్షుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇక పక్క గ్రామంలో సాగర్ పాలిటెక్నిక్ చదువుతుంటాడు.
 
అక్కడే మహాలక్మి (భాగ్యశ్రీ బోర్సె) చదువుతుంటుంది. ఆమె తండ్రి రావురమేష్. అతనికి ఆ ఊరిలో మహాలక్మి థియేటర్ వుంటుంది. అక్కడే సాగర్ తన అభిమాన హీరో సినిమా రిలీజ్ రోజే పేపర్లు చించి ఎగరేయడం వంటి పనులు చేస్తుంటాడు. తొలిచూపులో సాగర్ ఆమెను ప్రేమించేస్తాడు. హుషారైన సాగర్ ను చూసి తనూ ప్రేమిస్తుంది. కాగా, ఓరోజు హీరో సూర్య 100వ సినిమా డబ్బుల్లేక ఆగిపోయిందని పేపర్ లో పడుతుంది. అది చూసి సహించలేక సాగర్ ఆ డబ్బును సూర్య అకౌంట్ లో జమచేస్తాడు. ఇక తన స్టార్ డమ్ అయిపోయిందనుకున్న సూర్య..అభిమాని ఇలా నన్ను నిలబెట్టాడని తెలిసి ఏమి చేశాడు? ఆ తర్వాత జరిగిన కథేమిటి? మహాలక్మితో సాగర్ ప్రేమ సక్సెస్ అయిందా? లేదా? అనేది మిగిలిన సినిమా.
 
సమీక్ష:
కథ ప్రకారం చూస్తే, అభిమాన హీరో అంటే ఒకరమైన పిచ్చిప్రేమ. చాలా మంది అభిమానులు తమ హీరో సినిమాల రిలీజ్ రోజున సాగర్ చేసినట్లునే థియేటర్లలో అల్లరి చేస్తుంటారు. కథ ఆరంభం నుంచి దర్శకుడు మహేష్ ప్రతి సన్నివేశాన్ని డిటైల్డ్ గా బోరింగ్ లేకుండా ఆవిష్కరించారు. అలాగే మాటల్లోనూ తన ముద్ర పడేలా చూసుకున్నాడు. సాగర్.. స్నేహితుడు రాహుల్.. సముద్రం -సూర్యుడు కలిసిపోయినట్లుగా ఒక సన్నివేశంలో మాట్లాడుతూ, నువ్వు పిచ్చిగా అభిమానిస్తున్నావ్. ‘‘చూశావా రా.. సాగర్-సూర్య ఇద్దరూ కలిసిపోయినట్లే ఉంటారు.. కానీ ఎప్పటికీ కలవరు’’ అంటాడు. వెంటనే సాగర్...‘‘కలవకపోయినా చూడ్డానికి బాగుంది కదరా’’ అంటాడు. ఒక స్టార్ హీరోకు.. అభిమానికి మధ్య ఉండే బంధాన్ని దర్శకుడు మహేష్ బాబు బాగా డీల్ చేశాడు.
 
ఈ సినిమాలో ఎక్కడా విసుగుపుట్టించే సన్నివేశాలు లేవు. హీరోయిన్ పరిచయం కూడా చాలాచక్కగా చూపించాడు. హీరో తండ్రిగా రావురమేష్ కొడుకు అయినా చదవి ప్రయోజకుడు అవ్వాలనుకునే తపన, హీరోయిన్ తండ్రికి అమ్మాయిని తన స్థాయి తన కులానికి చెందిన వాడికి ఇవ్వాలనే పట్టుదల కనిపిస్తాయి. ఇద్దరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.
 
సినిమాలో కీలకమైన పాత్ర ఉపేంద్ర అయితే, అభిమాని కోసం ఆయనవెతుక్కూ వచ్చే విధానం దర్శకుడు బాగా రాసుకున్నాడు. అందుకే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్.. అనే ట్యాగ్ లైన్ పెట్టి సినిమా తీశారు. టైటిల్ ను చూస్తే సినీ అభిమానుల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నంలా అనిపించొచ్చు. కానీ ఈ సినిమా అలాంటిది అస్సలే కాదు. నిజమైన అభిమాని అనేవాడు చూసి గర్వపడేలా వుండేలా రాసుకున్నాడు దర్శకుడు. సహజంగా హీరోల అభిమానుల మధ్య వుండే పొరపొచ్చాలు, రాగద్వేషాలు, కలెక్లన్ల గొడవలు తన్నుకోవడాలు వుంటాయి. వాటిని కూడా చాలా సింపుల్ గా చూపిస్తూ హీరోల అభిమానుల సమతూకం పాటించాడు. కానీ అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం.. కథ మధ్యలోకి వచ్చాక ఎలా ముందుకు సాగుతుందో ఒక అంచనాకు వచ్చేయడం వంటివి చిన్న చిన్న లోపాలున్నా అవిపెద్దగా పట్టించుకోరు.
 
తాను పాఠశాలలో చదువు నేర్చుకున్నా జీవిత పాఠాన్ని అవమానాల్ని తట్టుకునేలా చేసింది హీరో ఓ సినిమాలో చెప్పిన డైలాగ్. పడు పడు.. నిలబడు.. పడిపోయినా మళ్ళీ నిలబడి ఎదుర్కో.. డైలాగ్ ను స్పూర్తిగా సాగర్ తీసుకోవడం సినిమా కథకు మూలం. అలా తనతోపాటు తన వర్గాన్ని చైతన్యం చేసేలా చేసిన వాడే సాగర్ అనే అభిమాని. వీలైనంత మేర రియలిస్టిగ్గా ఈ కథను చెప్పే ప్రయత్నమే చేశాడు మహేష్ బాబు. ఒక అభిమాని తన హీరో కోసం ఎంత దూరం వెళ్తాడనే నేపథ్యంలోనే సినిమా సాగినప్పటికీ.. రియల్ ఫిలిం ఫ్యాన్స్ దీన్ని చూసి తప్పుదోవ పట్టకుండా ఒక సానుకూల కోణంలోనే ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు.  
 
టూరింగ్ టాకీస్ కట్టడానికి  గుడి కట్టడం వెనుక స్ఫూర్తి ఏంటో రావు రమేష్ పాత్రతో చెప్పించిన ఒక సన్నివేశం రామాయణంలో పాయింట్ ను జోడించి ఆకట్టుకునేలా చేశాడు. అభిమాన హీరో కు చిన్న సాయం చేసినందుకు నిర్మాత రఘుబాబు సాగర్ కు చేసే సాయం అనేది మనం ఒకరికి సాయం చేస్తే తిరిగి మనకు సాయం వచ్చేలా చేస్తుందనేలా దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. ఇలా పలు సంఘటనలు రాసుకుని చక్కటి పాటలతో కూడిన సంగీతంలో సినిమాను అలరింపజేసేలా వుంది.
 
థియేటర్ ఓనర్ మురళీ శర్మ కు సాగర్ సవాల్ విసరడం అనేది రొటీన్ అయినా తాను థియేటర్ కట్టడం కోసం చేసిన ప్రయత్నాలు అందరిలో చైతన్యాన్ని నింపుతాయి. ఇక పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్. సినీ హీరోలను దేవుళ్లలా ఆరాధించే అభిమానులకు ఇదొక ట్రిబ్యూట్. నేను ఫలానా హీరోె అభిమానిని అని చెప్పుకునే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్టవుతుంది. తనను చూసి ఇన్ స్పైర్ అయి అభిమాని ఓ భాగమైతే, అభిమానిని చూసి హీరో ఇన్ స్పైర్ కావడం ముగింపు సన్నివేశం అందరి హుద్రయాలను టచ్ చేస్తుంది.
 
చాలా కాలంగా రామ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ అని చెప్పవచ్చు. తొలి సినిమానుంచి వున్న చురుకుదనం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. హీరోకు వీరఅబిమానిగా రామ్ అలరించాడు. హీరో ఉపేంద్ర స్థాయి తగ్గ పాత్ర చేసి మెప్పించాడు. ఈ పాత్రకు నాగార్జునను ముందుగా అనుకున్నా కొన్ని కారణాలవల్ల ఆయన చేయలేకపోయాడు. ఇక తులసి, రాహుల్ రామక్రిష్న తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అనంత శ్రీరామ్ తన అభిరుచిని దొంగపాత్రలో ఆస్వాదించాడు.
 
వివేక్-మెర్విన్ సంగీతం సినిమాకు బలం అని చెప్పవచ్చు. కథలో ఉన్న ఎమోషన్ ను అర్థం చేసుకుని వీళ్లిద్దరూ హృద్యమైన సంగీతం అందించారు. ‘నువ్వుంటే చాలు’ వినపొసంపుగానే కాదు కనువిందుగానూ అనిపిస్తుంది. సిద్దార్థ్ నూని ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. మైత్రీ మూవీ మేకర్స్ మంచి నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారు. రచయిత, -దర్శకుడిగా మహేష్ బాబు సక్సెస్ అయ్యాడు.  ఎందుకంటే ఈ కథను అతను నిజాయితీగా ఈ కథను తెరకెక్కించాడు. ఇది టాలీవుడ్ సినిమా చరిత్రలో మైలురాయిలా వుంటుంది.
రేటింగ్- 3/5

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

Nara Lokesh: విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి.. సామాజిక మార్పుకు సహకరించాలి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments