Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధధూన్ తరహాలో రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా చిత్రం ప్రారంభం

డీవీ
శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (16:36 IST)
Raj Tarun - Rashi Singh clap by maruti
రాజ్ తరుణ్ హీరోగా రాశి సింగ్ నాయికగా సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ పై రమేష్ కడుములు ని దర్శకుడుగా పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్  నిర్మిస్తున్నారు.
 
ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల  తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు  ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.  
 
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ కడుముల మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్ ఈనెల 15 నుండి ప్రారంభమవుతుంది. కంటిన్యూ షూటింగ్ వుంటుంది. అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది  క్రైమ్ కామెడీ. స్వామిరారా, అంధధూన్ తరహాలో వుంటుంది. కథ చాలా అద్భుతంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఎస్ కే ఎన్ గారికి, మారుతి గారికి, నక్కిన త్రినాధరావు రావు గారికి, వంశీ గారికి, అలాగే ధీరజ్ మొగలినేని గారికి ఆయన ధన్యవాదాలు' తెలిపారు.
 
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఇది చాలా మంచి కథ. క్రైమ్ కామెడీ జోనర్. నా ఫేవరట్ జోనర్. మీ అందరికీ ఆశీర్వాదం కావాలి' అన్నారు. 
 
ప్రొడ్యూసర్ కేఐటిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కథ చాలా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది. ఏప్రిల్ 15 నుంచి షూటింగ్ కి వెళ్తున్నాం.  ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులకు అలాగే ముఖ్య అతిథులకు పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  
 
మాధవి అద్దంకి మాట్లాడుతూ, దర్శకులు రమేష్ చాలా ప్రతిభావంతుడు. ఈ సినిమా కథ, కథనం చాలా అద్భుతంగా వుంటుంది. ఈ సినిమా ప్లాట్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాకు హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్ రాశి ఆప్ట్. ఈ  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు' తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments