Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగదిక్కు లేదు కదా.. అండగా ఉంటాననేవాడు... యాంకర్ శ్యామల

ఠాగూర్
ఆదివారం, 17 మార్చి 2024 (11:39 IST)
ప్రముఖ యాంకర్ శ్యామల.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఆమెకు ఎదురైన సమస్యలను పూసగుచ్చిటన్టు వివరించారు. తన కెరీర్ తొలి రోజుల్లో అనేక మంది నుంచి వేధింపులు ఎదుర్కొనట్టు చెప్పారు. ముఖ్యంగా, మగ దిక్కులేడు కదా.. నేను తోడుగా ఉంటానని పలువురు వ్యాఖ్యానించారన్నారు. ప్రేమ ప్రతిపాదనలతో పదేపదే ఇబ్బంది పెట్టేవారన్నారు. ఓ కెమెరామెన్ అర్థరాత్రి ఫోన్ చేసి విసిగించేవాడని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 
 
సినిమాల్లో నటించాలన్న కోరికతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాం. ముందుగా సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో అక్కడ నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోను సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగులో కొందరు నన్ను విసిగించేవారు. లవ్ ప్రపోజల్స్ పెట్టి పదేపదే ఇబ్బందికి గురిచేసేవారు. అవన్నీ నేను తట్టుకోలేక ఒప్పందం చేసుకున్న పలు సీరియల్స్‌ను రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 
 
ఆ సమంయలో ఓ కెమెరామెన్ బాగా వేధించేవాడు. అర్థరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాకు తెప్పించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది. అపుడు అతడు మీకు మగ దిక్కు లేదు కదా మీ కోసం ఏమైనా చేస్తాను. మీ కూతురికి ఆ విషయం అర్థం కావడం లేదు. నేను ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పిన దానికి అంగీకరిస్తే ఏదైనా చేయడానికి వెనకాడను అని అన్నాడు. దీంతో మా అమ్మ అతడు ఏదైనా హాని చేస్తాడేమోనని భయపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్లిపోదామని ఒత్తిడి చేసింది. కానీ, నేను అలాంటివి పట్టించుకోలేదు. ధైర్యంగా ఉండమని అమ్మకు ధైర్యం చెప్పాను. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి అని ఆమె వెల్లడించారు. ఇపుడు యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments