Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఫీవర్: బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం.. యాంకర్ రవి ఫైర్

బాహుబలి ఫీవర్.. శుక్రవారం రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యావత్తు ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? స్టోరీ ఏంటో మొత్తం తెలిసిపోతుంది. తద్వారా

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (14:42 IST)
బాహుబలి ఫీవర్.. శుక్రవారం రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం యావత్తు ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? స్టోరీ ఏంటో మొత్తం తెలిసిపోతుంది. తద్వారా ఐదేళ్ల పాటు తీవ్రంగా శ్రమించిన జక్కన్న టీమ్‌ కష్టాలు ఫలిస్తాయని సినీ పండితులు అంటున్నారు. ఈ సినిమా కోసం ఐదేళ్ల పాటు జక్కన్న అండ్ టీమ్ ఎంతో శ్రమించింది. 
 
ఇప్పటికే ప్రీ-రిలీజ్‌ పేరిట భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్లు టిక్కెట్లతో పాటు.. ఇతరత్రా ఫుడ్స్‌పై బాగా రేట్స్ కుమ్మేస్తున్నాయి. 
'బాహుబలి: ది కన్ క్లూజన్' విషయంలో మల్టీ ప్లెక్సుల ఆగడాలపై టీవీ యాంకర్ రవి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
'ఆలోచించకుండా... ఎంత అడిగితే అంత ఇస్తున్నాము. ఐ ఫీల్ దే ఆర్ లూటింగ్ అజ్ ఫ్రెండ్స్. బ్రెడ్ ముక్క, కొంచెం చీజ్, రెండు టొమాటో, కీర ముక్కల శాండ్‌విజ్ రూ. 70 రూపాయలా అంటూ అడిగారు. పాప్‌కార్న్ రూ.350 వరకు పలుకుతుంటే.. వాటర్ బాటిల్ రూ. 40 రూపాయలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మల్టీఫ్లెక్స్ బాగానే వ్యాపారం చేస్తున్నాయని.. వ్యాపారం పేరిట బట్టలు కూడా లాగేసుకోవడం దారుణం.. డూ యూ ఎగ్రీ?" అని ప్రశ్నించాడు. రవి చేసిన పోస్టుపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తూ, మద్దతు పలుకుతున్నారు.
 
ఇదిలా ఉంటే గురువారం రాత్రి 10.30 గంటలకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' బెనిఫిట్ షోను ప్రదర్శిస్తామని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ ధియేటర్ టికెట్ కౌంటర్ సిబ్బంది తెలిపారు. బెనిఫిట్ షోకు టికెట్లను ధియేటర్ యాజమాన్యం అమ్మలేదని వారు పేర్కొన్నట్టు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన వారే ధియేటర్ ను బుక్ చేసుకున్నారని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments