Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆదికి నేనున్నా... అండగా నిలిచిన అనసూయ

మొన్నీమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథలను ఉద్దేశించి చెప్పిన ఒక డైలాగ్ వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే విషయంపై కొంతమంది అనాథలు హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారు

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2017 (17:10 IST)
మొన్నీమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథలను ఉద్దేశించి చెప్పిన ఒక డైలాగ్ వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే విషయంపై కొంతమంది అనాథలు హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇప్పటివరకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ వ్యవహారంపై స్పందిస్తే అనసూయ తాజాగా స్పందించారు. 
 
మనమంతా ఎంటర్టైన్‌మెంట్ వరల్డ్‌లో ఉన్నాం. ఈ వరల్డ్‌లో హిస్టరీ క్రియేట్ చేసిన షో జబర్దస్త్. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. తెలుగు రాష్ట్రాలోనో, లేక దక్షిణాదిలోనో కాదు భారతదేశంలో హిస్టరీ క్రియేట్ చేసిన షో ఏదైనా వుందీ అంటే అది జబర్దస్త్ మాత్రమే. ఎందుకంటే ఒకేసారి ఇంత హిట్ అయిన షో మరొకటి లేదు. దీనిగురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే చెబుతున్నా. వెండితెరపై బాహుబలి ఎలా కొత్త ట్రెండ్‌ను సృష్టించిందో బుల్లితెరపై జబర్దస్త్ అంతే ట్రెండ్‌ను సృష్టించింది. 
 
ఈ షో కోసం రోజా, నాగబాబులు చాలా కష్టపడుతున్నారు. అయితే కొంతమంది ఈ షోను ఆపేవాలని, నిర్భంధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రియేటివిటిని తొక్కేయవద్దు, ప్రతి విషయాన్ని బూతద్దంలో పెట్టి చూడొద్దండి. గుమ్మడికాయ దొంగలు అంటే మీరెందుకు భుజాలు తడుముకొంటున్నారు. ఆ స్కిట్లో హైపర్ ఆది అందరూ అనాథలను ఉద్దేశించింది చెప్పింది కాదు. కొంతమందిని మాత్రమే ఉద్దేశించి చెప్పింది. ఆ స్కిట్లో ఉన్నవారిని గురించి చెప్పింది మాత్రమే. దీని గురించి బాగా ఆలోచించండి.. అనవసర రాద్దాంతం చేయొద్దంటూ సామాజిక మాథ్యమాల ద్వారా పోస్ట్ చేసింది అనసూయ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments