Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియా

Webdunia
బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:16 IST)
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు రావడంతో.. అసహనానికి గురైన అనసూయ.. బాలుడి ఫోన్‌ను నేలకేసి కొట్టింది. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ను పగులకొట్టడమే కాకుండా.. దుర్భాషలాడిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. 
 
కానీ ఈ వ్యవహారంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. ఫోన్ పగులకొట్టినందుకు క్షమాపణలు కూడా అడిగింది. కానీ ఫోన్ పగిలిందా లేదా అని తాను గమనించలేదని చెప్పింది. ఇంతలో ట్విట్టర్లో ఓ యువకుడు అనసూయ ఫోన్ పగులకొట్టడాన్ని తాను చూశానని ట్వీట్ చేశాడు. ఆ యువకుడి వద్ద విచారిస్తామని పోలీసులు కూడా హామీ ఇచ్చారు. దీంతో నెటిజన్లు అనసూయపై తిట్ల వర్షం కురిపించారు. 
 
క్షమాపణలు చెప్పినా చిన్నారి అభిమాని ఫోన్ పగులకొట్టిన వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. అనసూయ ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతే సోషల్ మీడియా వద్దు ఏమీ వద్దు అనుకుంది. నెటిజన్ల విమర్శలకు మనస్తాపానికి గురైన అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో అనసూయ అకౌంట్స్ కనిపించట్లేదు. మొత్తానికి సెల్ ఫోన్ వ్యవహారంతో అనసూయ హర్టయ్యిందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యవహారంలో నెటిజన్లు ఓవరాక్షన్ చేశారని వారు మండిపడుతున్నారు.
 
ఇకపోతే.. బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ ప్రస్తుతం రామ్‌ చరణ్ రంగస్థలం, మోహన్ బాబు గాయత్రి సినిమాలతో పాటు శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న ''సచ్చిందిరా గొర్రె'' సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments