Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా బట్టల గురించి మీకెందుకు..టాప్ యాంకర్ ఫైర్

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (14:32 IST)
తాజాగా జరిగిన పుల్వామా ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ విధంగానే యాంకర్ అనసూయ పెట్టిన పోస్ట్‌కు సంబంధం లేకుండా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వచ్చాయి. దీంతో బాధపడిన అనసూయ నెటిజన్లకు గట్టిగానే సమాధానం ఇచ్చింది. 
 
నేను పెట్టిన పోస్టుకు సంబంధం లేకుండా, నేను ఎందుకు పెట్టానో కూడా తెలుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను శాంతి గురించేమీ మాట్లాడలేదు. నాకు కూడా ఈ ఘటనపై చాలా కోపం వచ్చింది. కానీ సోషల్ మీడియా ద్వారా ఎవరినీ రెచ్చగొట్టకూడదు. యుద్ధం చేయాల్సిందే అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ మాట చెప్పేవారు ఎవరైనా అక్కడికి వెళ్లి యుద్ధం చేస్తారా? కనీసం అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఊపిరి తీసుకోవడానికే కష్టపడే పరిస్థితులు ఉంటాయి.
 
జరిగింది ఘోరమైన ఘటనే, కాదనను, అందుకని మనం కూడా అదే చేస్తే ఎంత వరకు సమంజసం అంటూ అనసూయ ఫైర్ అయ్యారు. కొంత మంది అయితే నీకెందుకుమ్మా ఇవన్నీ, పిక్స్ పోస్ట్ చేసుకో, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని పని చూసుకో అంటూ అసహ్యంగా కామెంట్స్ పెట్టారు. ఇలా జరిగిందని మీరేమైనా తినడం, పడుకోవడం మానేస్తున్నారా? లేదా అందరూ పోరాడటానికి కాశ్మీర్ వెళ్లిపోతున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
చేస్తే మంచి చేయండి. అంతేగానీ, నువ్వు బట్టలు సరిగ్గా వేసుకో.. అసలేంటీ కామెంట్స్? నేను ఏ బట్టలు వేసుకుంటే మీకెందుకండీ? ప్రతిసారి ఎందుకు నా బట్టల మీదకే వస్తారు? మీ బుద్ది ఇంతేనా, ఇక మారరా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments