Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వేషించేవారిని నిరాశపరుస్తూనే ఉంటా : అనసూయ

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2023 (13:44 IST)
ద్వేషించేవారిని నిరంతరం నిరాశపరుస్తూనే ఉంటానని హీరోయిన్, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ అన్నారు. ఇదే విషయంపై ఆమె తాజాగా పెట్టిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. హేటర్స్ (ద్వేషించేవారు)ని ఉద్దేశించి ఆమె ఈ ట్వీట్ చేశారు. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని అన్నారు. 
 
'మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వ్యక్తులనే భావన పొందుతారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా ఉండేలా నేను జీవితంలో ముందుకెళ్తా. ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే, నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకుంటారు. బతికినంతకాలం చావాలనిపించేలా ట్రీట్‌ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.
 
ఏది ఏమైనా ఇంతకముందు నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లందరినీ ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరు నా బలం. శక్తి' అని ఆమె ట్వీట్‌ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో.. 'ఐ యామ్‌ సారీ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్‌ పొందడం కోసం కాదా?' అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments