Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్‌ దేవరకొండ ‘హైవే’ షూటింగ్‌ ప్రారంభం.

Webdunia
బుధవారం, 14 జులై 2021 (15:37 IST)
Anand DEVARAKONDA, Manasa Radhakrishnan
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ హీరోగా న‌టిస్తోన్న‌ చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్‌. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. తొలిచిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీలో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో హీరోయిన్‌ అంటూ పాపులర్‌ అయిన మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘హైవే’ చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్‌. ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 
 
చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  మరికొంతమంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘హైవే’ తప్పకుండా ఒక సక్సెస్‌ఫుల్‌ థ్రిల్లింగ్‌ మూవీ అవుతుంద‌ని న‌మ్మ‌కంఉంది’అన్నారు.
 
చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ,‘నేను దర్శకత్వం వహిస్తోన్న మూడో చిత్రమిది ‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ మూవీ. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉండబోతుంది. సైమన్‌ కె. కింగ్‌ సంగీతం ఈ చిత్రానికి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్‌
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments