Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వినోదం కూడా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది : నితిన్

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (19:16 IST)
Vamsi-nitin
నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా నుంచి శనివారం చిత్ర యూనిట్ ‘ఓలే ఓలే పాపాయి..’ అనే పాటను రిలీజ్ చేసింది. హేరిస్ జైరాజ్ సంగీత సారథ్యంలో ఈ పాటను రామ్ మిర్యాల, ప్రియా హేమెస్ పాడారు. కాసర్ల శ్యామ్ పాటను రాశారు.

ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ జనాల్లోకి ఎంత బాగా వెళ్లిందనేది వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఎక్స్‌ట్రార్డినరీగా ఉండబోతుంది. డిసెంబర్ 8న మూవీ రిలీజ్ అవుతుంది. నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఇది బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రతిరోజూ ఎంజాయ్ చేశాను. కచ్చితంగా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని ప్రామిస్ చేస్తున్నాను. డిసెంబర్ 8 నాతో పాటు నా టీమ్‌కి, ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది’’ అన్నారు.
 
చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాను స్టార్ట్ చేసి ఏడాదిన్నర అవుతుంది. నితిన్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఎంతో కష్టపడ్డారు. టైటిల్‌కి తగ్గట్టు, ప్రేక్షకుల అంచనాలను ధీటుగా సినిమా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఈ సినిమా కోసం పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణలకు థాంక్స్’’ అన్నారు.
 
దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా టీజర్, పాటలు, ఇప్పుడు ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ చేశారు. ట్రైలర్‌లానే సినిమా ఉంటుందా? అని అందరూ అడుగుతున్నారు. ట్రైలర్‌కు పదింతలుగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఉంటుంది. మంచి బిర్యానీ తినిపిస్తా. ఈ సందర్భంగా నితిన్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పాలి. నాతో అడుగడుగునా అండగా నిలబడుతూ నడిచారు. తన సపోర్ట్ లేకపోతే ఈ సినిమాను ఇలా తీసేవాడిని కాను. అలాగే నిర్మాత సుధాకర్ రెడ్డిగారికి థాంక్స్. డిసెంబర్ 8న అందరూ థియేటర్స్‌లో కలుద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments