Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇది కన్‌ఫర్మ్..రాసి పెట్టుకోండి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ హిట్ : నితిన్

Advertiesment
Vamsi-nitin
, మంగళవారం, 28 నవంబరు 2023 (12:51 IST)
Vamsi-nitin
హీరో నితిన్ కథానాయకుడిగా వక్కంతం దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ 8న రిలీజ్ అవుతున్న ఈ సిినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థాంక్స్. ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడను. రిలీజ్ తర్వాత మాట్లాడుతాను’’ అన్నారు.
 
డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఈ ఔట్ పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. నిజానికి కష్టపడ్డామని చెప్పకూడదు. ఎందుకంటే అది మా బాధ్యత. అందరినీ ఎంటర్‌టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం. అందరి సపోర్ట్ కావాలి. ట్రైలర్ కంటే పదిమింతలు మించి సినిమా ఉంటుంది. అందరికీ థాంక్స్’’ అన్నారు.
 
హీరో నితిన్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్‌లో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన బెస్ట్ క్యారెక్టరైజేషన్ మూవీస్‌లో ఇది నెంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు రాసిన కిక్, రేసుగుర్రం, టెంపర్ సినిమాలన్నీ బావుంటాయి. వాటిన్నంటికీ తగ్గకుండా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. డిసెంబర్ 8న మూవీ రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయటమే ఈ మూవీ గోల్. నాన్ స్టాప్‌గా అందరినీ నవ్విస్తాం. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు కూడా ఉంటాయి. అలాగే మంచి డాన్స్ కూడా ఉంటుంది. బాగా డాన్స్ చేసి చాలా కాలమవుతుంది. ఈ మూవీలో లాస్ట్ సాంగ్ మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 8న గుద్దబోతున్నాం. ఇది కన్‌ఫర్మ్.. రాసి పెట్టుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పనున్న విజయ్ దేవరకొండ