కార్తీక బహుళ పాడ్యమి రోజున మిగిలిన ఆహారం, పెరుగు తినకూడదు. అలాగే జామకాయ మొక్కను పూజించాలి. కుటుంబ సమేతంగా భోజనం చేయాలి. అలాగే మంగళవారాలు సోమవారాల్లో శివునికి విశేష పూజలు చేయించాలి.
కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది. అలాగే పంచభూతాల్లో అగ్ని స్థలమైన తిరువణ్ణామలైని సందర్శించడం మంచిది. కార్తీకమాసమంతా ఇంట్లో దీపాలు పెట్టడం మంచిది.
ఇంట్లో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. దేవుని మందిరంలోనూ, తులసి కోట ముందు కుబేర ముగ్గు వేయాలి.
ఉసిరికాయలు కార్తీక మాసం 30 రోజులు తీసుకోరాదు. కార్తీక మాసంలో ఆవునెయ్యిని దానంగా ఇస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.