శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ॥ కార్తీక ఐ. పాఢ్యమి ప.1.40 రోహిణి ప.1.55 ఉ.శే.వ. 7. 28 కు
రా.వ. 7.39 ల 9.17. ఉ.దు. 8. 19 ల 9.05రా.దు. 10. 28 ల 11.18.
లక్ష్మీకుబేరుడిని ఆరాధించడంవల్ల మీ శుభం, జయం, పురోభివృద్ధి కానవస్తుంది.
మేషం :- వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి నిరంతరం శ్రమించాలి. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరగగలదు. ఉద్యోస్తులకు పనిలో ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. సంఘంలో పెద్ద మనుషులతో పరిచయాలులభిస్తాయి.
వృషభం :- వృతిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. డాక్టర్లు శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
మిథునం :- స్త్రీలకు నరాలు, రుతుచక్ర సంబంధిత చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చించాల్సి ఉంటుంది. వనసమారాధనలు, దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు.
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు శ్రమ అధికం. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆహార, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
సింహం :- విదేశీయాన యత్నాల్లో అడ్డంకులు తొలగిపోగలవు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు తమ ఖాతాదారులు నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు షాపింగులోనూ, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
కన్య :- స్థిరాస్తి, వాహనం కొనుగోళ్ళు అనుకూలిస్తాయి. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలసి వచ్చేకాలం. సోదరి, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. దైవ దీక్షలు, మొక్కుబడులుఅనుకూలిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. కోర్టు వ్యవహరాల్లో పురోగతి కనిపిస్తుంది.
తుల :- ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మీ అలవాట్లు, బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.
వృశ్చికం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. స్త్రీలకు ఉపవాసాలు, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రత్యర్థులు మీ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తారు. విద్యార్థినులలో ధ్యేయం పట్ల ఆసక్తి, కొత్త విషయాల పట్ల ఏకాగ్రత నెలకొంటాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి.
ధనస్సు :- వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులు అకారణంగా మాటపడవలసి వస్తుంది. దైవ దీక్షలు, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గత కొంతకాలంగా అనుభవిస్తున్న రుగ్మతలు, చికాకులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఊహించని చికాకులు ఎదురవుతాయి.
మకరం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు సంతోషపరుస్తాయి.
కుంభం :- మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. బ్యాంకు ఉద్యోగులకు చికాకులు తప్పవు. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులెర్కోవలసి వస్తుంది. భాగస్వామిక చర్చలలో కొత్త విషయాలుచోటు చేసుకుంటాయి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. మీ అతిథి మర్యాదలు ఎదుటివారిని సంతృప్తిపరుస్తాయి.
మీనం :- సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. మీ ప్రమేయం లేకున్నా మాటడవలసివస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి అక్షర దోషం వల్ల చికాకులు తప్పవు. ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు.