Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు మళ్లీ కరోనా వైరస్ సోకింది : అమితాబ్ బచ్చన్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (07:36 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అర్థరాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు మళ్లీ కరోనా వైర సోకిందని, అందువల్ల తనను కలిసివారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
బిగ్ బికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
కాగా, అమితాబ్ కరోనా వైరస్ బారినపడటం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం కరోనా సోకినపుడు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌లు కూడా కోవిడ్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, అమితాబ్ నటించిన "బ్రహ్మాస్త్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, గుడ్‌బై, ఊంచాయి సినిమాల్లోనూ నటిస్తున్నారు. రష్మిక మందన్నాతో కలిసి మరో చిత్రంలో నటించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments