డిసెంబరు 20న `వంగవీటి`కి హాజరవుతున్న అమితాబ్, నాగార్జున
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `వంగవీటి`. రీసెంట్‌గా విజయవాడలో విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెండు పాటలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే పాడారు. ఈ పాటలకు, ఆ పాటల సాహిత్యానికి మ్
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `వంగవీటి`. రీసెంట్‌గా విజయవాడలో విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రెండు పాటలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మనే పాడారు. ఈ పాటలకు, ఆ పాటల సాహిత్యానికి మ్యూజిక్ లవర్స్ నుండి మంచి అప్రిసియేషన్ వస్తుంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాను డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 20న హైదరాబాద్ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ భారీ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఓ బాలీవుడ్ సూపర్‌స్టార్ తెలుగు వేడుకకు ఇలా విచ్చేయడం ఇదే ప్రథమం. బిగ్ బి, నాగార్జున వంటి స్టార్స్ ఈ వేడుకకు హాజరవుతుండటంతో వంగవీటిపై భారీ క్రేజ్ నెలకొంది.