Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (11:16 IST)
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. వీరిద్దరి దూకుడు చూసినవారికి త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే భావన కలిగింది. అయితే, ఇపుడు వారి ప్రేమ వికటించినట్టుగా తెలుస్తుంది. వారిద్దరూ విడిపోయినట్టు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా, ఇక నుంచి మంచి స్నేహితులుగా కొనసాగాలని వారిద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ వార్తలను తమన్నా అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
వీరిద్దరూ విడిపోయారనేది మాత్రం నిజమేనంటూ పలు మీడియాలో సంస్థలలో తెలియరాలేదు కానీ, వారిద్దరూ విడిపోయారనేది మాత్రం నిజమేనంటూ పలు మీడియా సంస్థలలో వార్తలు వెలుపడ్డాయి. ప్రేమికులుగా విడిపోయినా మంచి స్నేహితులుగా కొనసాగుతామని తమన్నా విజయ్ చెబుతున్నారట. వృత్తిపరంగా ఒకరినొకరు గౌరవించుకుంటారని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. 
 
అయితే, ఈ లవ్ బ్రేకప్ వార్తలపై ఇటు తమన్నా కానీ అటు విజయ్ కానీ స్పందించలేదు. ఇప్పటికే వారాలు గడిచినా తమ బ్రేకప్ విషయంపై వారు ఎక్కడా మాట్లాడలేదు. కాగా, నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ "లవ్ స్టోరీస్-2" షూటింగ్ సందర్భంగా తమన్నా, విజయ్ వర్మల మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుంచి నిన్నామొన్నటివరకు వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ అలెర్ట్!!

వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ-వారం పాటు వాయిదా

పౌరసత్వం కేసు : చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు షాక్.. రూ.25 లక్షలు చెల్లింపు

Janavani: జనవాణి కోసం రీ షెడ్యూల్.. వేసవికాలం కావడంతో పనివేళల్లో మార్పులు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments