Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుహాస్ హీరోగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (17:39 IST)
Ambajipet Marriage Band poster
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు.  భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు”.
 
షార్ట్ ఫిల్మ్స్ తో కెరియర్ మొదలు ‘కలర్ ఫోటో’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు సుహాస్. కేవలం యూత్ కి నచ్చే కాన్సెప్ట్స్ బేస్డ్ సినిమాలు మాత్రమే కాకుండా, రీసెంట్ గా ‘రైటర్ పద్మభూషణ్’ వంటి సినిమా చేసి ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా దగ్గరయ్యాడు సుహాస్.
 
ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న  ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. జీఏ2 పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో దుశ్యంత్ కటికనేని ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. 
 
మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడ. ఈ వేసవిలో మోత మోగించడానికి మల్లిగాడు వచ్చేస్తున్నాడంటూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్ ను రేపు  (11-04-2023) రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments