Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్లీన్ U/A సర్టిఫికెట్ పొందిన వినరో భాగ్యము విష్ణు కథ

Advertiesment
Kiran Abbavaram
, శనివారం, 11 ఫిబ్రవరి 2023 (16:43 IST)
Kiran Abbavaram
అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  తెరకెక్కిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’.  బ‌న్నీ వాసు  నిర్మాత‌. కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కిరణ్ సరసన  క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది..తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వారు  క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 18న  గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..ఇప్పటి వరకు కిరణ్ చేసింది తక్కువ చిత్రాలే అయినా తను సెలెక్టివ్ కథలను ఎంచుకొంటూ ఇప్పుడు బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు.  తను నటించిన "వినరో భాగ్యము విష్ణు కథ" సినిమా విషయానికి వస్తే తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి.ఇదివరకే కిరణ్ కి "ఎస్.ఆర్ కల్యాణమండపం" సినిమాకి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో పాటలను రచించారు.ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన  "వాసవసుహాస" "బంగారం", పాటలతో పాటు మనసే మనసే తననే కలిసే అపుడే అపుడే తొలిప్రేమలోన పడిపోయా కదా తనతో నడిచే అడుగే మురిసే" అని స్టార్ట్ అయ్యే ఈ బ్రేకప్ సాంగ్ లోని "తట్టుకోవడం కాదే పిల్ల నావల్లా  వయ్యారి, గుక్కపట్టి ఏడుస్తుందే నా ప్రాణం నీవల్లా" వంటి పాటలకు  ప్రేక్షకులనుండి ఊహించ లేనటువంటి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ లభిస్తుంది. కిరణ్ కు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు సెన్సార్ వారు క్లీన్ U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.  ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే విధంగా తెరకెక్కిన  ఈ సినిమాను ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాము. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు చూడాలని వుంది ఇప్పుడు భోళా శంకర్ సెట్ ను సందర్శించిన కె రాఘవేంద్రరావు