Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

డీవీ
గురువారం, 21 నవంబరు 2024 (10:28 IST)
Venkatesh, Anil Ravipudi, Aishwarya Rajesh, Meenakshi Chaudhary
 
వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ భార్యగా మీనాక్షి చౌదరి నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు, రమణ గోగుల పాడిన ఫస్ట్  సింగిల్ త్వరలో విడుదల కానుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
రిలీజ్ డేట్ గురించి హీరో వెంకటేష్ మాట్లాడుతూ..  ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ  బావుంటుంది. అనిల్ తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కథని  చాలా బాగా రాశారు. అద్భుతంగా తీశారు. సినిమా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కెరియర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాల్లో పని చేసిన యాక్టర్స్, టెక్నిషయన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా సంక్రాంతికి వండర్ఫుల్ ఫిల్మ్ కాబోతుంది. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు' అన్నారు
 
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, మహేష్ గారితో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారితో, నాకు ఇష్టమైన దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్ లో మీ అందరినీ నవ్వించడానికి సంక్రాంతి వస్తున్నాంతో వస్తున్నాం. భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్ గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎక్స్ కాప్,  ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు.  రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి. అలాగే నా హీరో బాలయ్య బాబు గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. అన్ని జోనర్ సినిమాలు వున్నాయి. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి' అన్నారు  
 
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. భాగ్యం లాంటి పాత్రని స్క్రీన్ మీద రాలేదు. చాలా స్పెషల్ రోల్. ఈ సంక్రాంతి చాలా స్పెషల్ గా వుండబోతోంది. దర్శక నిర్మాతలకు థాంక్. ఈ సంక్రాంతి దిల్ రాజు గారిదే. వెంకటేష్ గారి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. అంతా ఫ్యామిలీలా ఈ సినిమా చేశాం. ఇది మన సంక్రాంతి' అన్నారు.    
 
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఇది నా డ్రీం క్యారెక్టర్. కాప్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఈ సినిమాతో ఆ డ్రీం నెరవేరింది. చాలా ఫన్ వున్న క్యారెక్టర్. అనిల్ రావిపూడి గారికి థాంక్. వెంకటేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మరిన్ని సినిమాలు వారి బ్యానర్ లో చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సముద్రపు తాబేలు కూర తిని ముగ్గురి మృతి, 30 మందికి పైగా అస్వస్థత

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.. పడ్డాడో అంతే సంగతులు? (వీడియో)

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. స్టెల్లా షిప్‌ను సీజ్‌ చేసిన అధికారులు

ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్‌పై తప్పుడు నివేదిక : డాక్టర్ ప్రభావతి అరెస్టు తప్పదా?

పులివెందుల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా : ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments