లుంగీ డాన్స్ తో అలరించనున్న అదితి శంకర్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్

డీవీ
గురువారం, 21 నవంబరు 2024 (10:18 IST)
Aditi Shankar, Bellamkonda Sai Srinivas, Vijay Kanakamedala
'భైరవం'  చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాలకొల్లు లో సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్ పై క్యూట్ లవ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. విజయ్ పోలాకి మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల చార్ట్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. మేకర్స్ షేర్ చేసి స్టిల్స్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ, షేడ్స్ తో రగ్గడ్ అండ్ మ్యాసీ అవాతర్ లో, హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు.    
 
ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నారా రోహిత్, మంచు మనోజ్ కూడా నటిస్తున్న ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments