Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

ఠాగూర్
గురువారం, 21 నవంబరు 2024 (08:28 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రెహ్మాన్ సతీమణి సైరా భాను ప్రకటించారు. ఆ తర్వాత రెహ్మాన్ కూడా తన భార్య చేసిన విడాకుల ప్రకటనపై స్పందించారు. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం రెహ్మాన్ సంగీత బృందంలో పని చేసే ఓ సభ్యురాలే ప్రధాన కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇలాంటి ప్రచారానికి ప్రధాన కారణ ఆమె వ్యవహారశైలినే. రెహ్మాన్ దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించిన ఓ గంట వ్యవధిలోనే రెహ్మాన్ టీమ్ సభ్యురాలు కూడా తన భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించారు. దీంతో రెహ్మాన్‌ ఆ సభ్యురాలితో రిలేషన్‌లో ఉన్నట్టు ప్రచారం సాగింది. ఆమె పేరు మోహని డే. అయితే, ఈ ప్రచారంపై రెహ్మాన్, మోహినిలు స్పందించలేదు. 
 
కాగా, తమ విడాకులపై మోహిని విడుదల చేసిన ప్రకటనలో "ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం. అంటూ తన సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చింది. 
 
అయితే ఏఆర్ రెహ్మాన్ విడిపోతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లో మోహిని పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అందుకే గంటల తేడాతో విడాకులు ప్రకటించారని చర్చ జరుగుతోంది. మోహిని ఏఆర్ రెహ్మాన్‌తో కలిసి కొన్నేళ్లుగా పని చేస్తోందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments