Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్‌కు సిద్ధ‌మ‌వుతున్న''అల్లుడు సింగం'': అంజలికి హిట్టిస్తుందా?

షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నహీర

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (17:06 IST)
షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నహీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం "'అల్లుడు సింగం'. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. 
 
పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న‌ ''అల్లుడు సింగం" సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని విధంగా లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డనుంది. ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. 
 
ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధ‌మైంది. ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ను ప్ర‌ముఖ ర‌చ‌యిత వ‌న‌మాలి రాశారు. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నామ‌ని నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలియ‌జేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments