Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి-బెల్లంకొండల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి సినిమా మేకింగ్ పట్ల విశేషమైన పట్టుతోపాటు అంతకుమించిన సెంటిమెంట్ వేల్యూస్ ఎక్కువ. అందుకే తన మొదటి చిత్రం "భద్ర" మొదలుకొని.. లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన "సరైనోడు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:24 IST)
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి సినిమా మేకింగ్ పట్ల విశేషమైన పట్టుతోపాటు అంతకుమించిన సెంటిమెంట్ వేల్యూస్ ఎక్కువ. అందుకే తన మొదటి చిత్రం "భద్ర" మొదలుకొని.. లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ అయిన "సరైనోడు" వరకూ ప్రతి సినిమాలోనూ మొదటి సన్నివేశాన్ని గచ్చిబౌలిలోని వనదేవత గుడిలో చిత్రీకరిస్తాడు. ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్‌ను కూడా అదే ప్లేస్‌లో మొదలెట్టారు.
 
ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన క్రేజీ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలయ్యింది. నేడు హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్-రకుల్ ప్రీత్ సింగ్‌లపై కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. "మా నిర్మాణ సంస్థ "ద్వారక క్రియేషన్స్"లో రూపొందుతున్న రెండో చిత్రమిది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో మా సంస్థ రెండో చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు కంప్లీట్ మేకోవర్ ఇవ్వడంతోపాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు బోయపాటి" అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments