గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టి తనకంటూ ఒక పేరు సాధించుకుని నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఎన్నో హిట్ చిత్రాలను సాధించడమే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఘనత అల్లు అర్జున్ ది.
కేవలం సినిమాలు పరంగా మాత్రమే కాకుండా తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు అల్లు అర్జున్. ఎప్పటికప్పుడు తన కూతురు వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అల్లు అర్జున్, నేడు తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకను ట్విట్టర్ వేదికగా షేర్ చేసారు.
తాజాగా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించారు. ఒక పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలా గోల్డన్ టెంపుల్ ను సందర్శించడం అల్లుఅర్జున్ లోని సింప్లిసిటీ కి నిదర్శనం అని చెప్పాలి. ఇంకా సినిమాలపరంగా పుష్ప సినిమాతో హిట్ అందుకున్న బన్నీ, ఇంకా పుష్ప-2 చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు.