Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు శిరీష్ చిత్రం బడ్డీ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్

Webdunia
మంగళవారం, 30 మే 2023 (18:29 IST)
Shirish, Buddy
యంగ్ హీరో  అల్లు శిరీష్ ఇటీవల "ఊర్వశివో రాక్షసివో" మంచి హిట్ అందుకున్నారు. ప్రేక్షకుల నుండి ఈ మంచి రెస్పాన్స్ లభించింది.  సినిమాలో నటీనటుల నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు శిరీష్  కొత్త సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజా సమాచారం ఏమిటంటే, టాప్ ప్రొడక్షన్ బ్యానర్ స్టూడియో గ్రీన్‌పై శిరీష్ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతోంది. మేకర్స్ ఈరోజు సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్‌ని విడుదల చేసారు.
 
రిలీజ్ చేసిన పోస్టర్‌లో అల్లు శిరీష్ తుపాకీతో కనిపిస్తుండగా, టెడ్డీ బేర్ అతని పక్కన ఫైటింగ్ పొజిషన్‌లో నిలబడి ఉంది. బడ్డీ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. అల్లు శిరీష్ తన బడ్డీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
 
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. గాయత్రి భరద్వాజ్, గోకుల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రూబెన్ ఎడిటింగ్ నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.
తారాగణం: అల్లు శిరీష్, గాయత్రి భరత్వాజ్, గోకుల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

బీసీలకు న్యాయం చేయాలంటే.. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలిసి నిలబడతాం: కేటీఆర్

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments