Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూబ్లీహిల్స్ లోని మిడిల్ క్లాస్ కుర్రాడి క‌థ‌తో ఊర్వశివో రాక్షసివో

Allu Shirish, Allu Aravind, tammareddy bhardwaj and others
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (18:11 IST)
Allu Shirish, Allu Aravind, tammareddy bhardwaj and others
అల్లు శిరీష్,అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన  "ఊర్వశివో రాక్షసివోష చిత్రం నవంబర్ 4 న  విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర వివ‌రాలు తెలియ‌జేసేందుకు మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. దీనికి దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించారు. అనూప్‌ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందించారు.  ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌ ధీరజ్ మొగిలినేని నిర్మించారు. విజయ్ ఎం సహ నిర్మతగా వ్యవహారించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు
 
ఈ సంద‌ర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా ఈ సినిమా కొన్ని ఇబ్బందులు పడ్డా ఫైనల్ గా నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇలాంటి మంచి కథను ఇచ్చిన భరధ్వజ గారికి ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ కుర్రాన్ని మిడిల్ క్లాస్ కు చూయించాలి అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా చక్కని బిహేవియర్ తో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయడం జరిగింది.చూసిన వారందరూ ఫుల్ టైమ్ ఎంజాయ్ చేస్తారు. అయితే తమ్మారెడ్డి భరధ్వజ గారు ఈ సినిమా చూసిన తరువాత నాకు కంటిన్యూ ఫోన్స్ చేస్తుండడంతో తనిచ్చిన కథను మేము సరిగా తియ్యలేకపోయారని అంటాడేమో అనుకుని మొదట టెన్షన్ పడ్డాము. కానీ తను చాలా బాగా తీశారు అని చెప్పడంతో హ్యాపీ ఫీల్ అయ్యాము .ఆ తరువాత నా ఫ్రెండ్స్ కు సినిమా చూయిస్తే అందరూ బాగుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి లు చాలా మంచి పాటలు ఇచ్చారు. అలాగే ఈ నెల 30 న జరుపుకునే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఇక ముఖ్యమైన అతిధి వచ్చి మనకు విశిష్టమైన అప్పిరియన్స్ ఇచ్చే ఆ ఫంక్షన్ చాలా ఇంట్రెస్ట్ గా జరగబోతుంది అన్నారు.
 
నిర్మాత భరద్వాజ మాట్లాడుతూ.. దాసరి నారాయణ రావు గారు, బాలచందర్  గార్లు మిడిల్ క్లాస్ సమస్యలను హుంధ్యంగా, చాలా అందంగా, సరదాగా చెప్పే వారు. వారు వెళ్ళిపోయిన తరువాత  మిడిల్ క్లాస్ సినిమాలు తగ్గిపోయిన ఈ రోజుల్లో  ఆలా బాగా చూయించిన సినిమా "ఊర్వశివో రాక్షసివో". మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు చాలా బాగాతీశాడు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్, సునీల్, వెన్నెల కిషోర్ ఈ నలుగురు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ బయటకు వచ్చి ఇంటికెళ్లిన తరువాత కూడా ఈ సినిమా గురించి ఆలోచించే విధంగా ఉంటుందని  అన్నారు.
 
చిత్ర దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ..నా మూడవ సినిమాకే అల్లు అరవింద్ గారితో కలసి చేయడం అదృష్టంగా బావిస్తూ నాకిలాంటి అవకాశం ఇచ్చినందుకు  చాలా థాంక్స్.గత 7 ఇయర్స్ నుండి అల్లు శిరీస్  తో పరిచయం ఉంది.అప్పటినుండి మంచి సినిమా చేద్దాం అనుకున్నాం.ఈ సినిమా విషయానికి వస్తే పస్తుత యూత్ ఆలోచనలు ఎలా వుంటున్నాయి అన్న పాయింట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా తీయడం జరిగింది. ప్రతి ఒక్క యువతీ యువకులకు  ఈ పాయింట్ కనెక్ట్ అవుతుందని చాలా స్ట్రాంగ్ గా చెప్ప గలుగుతాను.ఈ సినిమాతో మా ఇద్దరి కాంబినేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అలాగే మాకు మంచి టీం కుదిరింది. ఈ సినిమా టీజర్ లో ఎటువంటి కంటెంట్ ఉందో సినిమాలో ఇంతకంటే పదింతల కంటెంట్ ఉంటుంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫ్రెష్ ఫీల్ తో బయటికి వెళ్తారని కచ్చితంగా చెప్పగలను అన్నారు.
 
చిత్ర హీరో అల్లు శిరీస్ మాట్లాడుతూ..ఈ సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ గారు చెప్పినట్టు ప్రేక్షకులు ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఈ సినిమాగురించి ఆలోచిస్తారు. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేయడం కష్టం కాకాపోవచ్చు కానీ ఒక సినిమా చూసిన తర్వాత కూడా  ఆ సినిమా గురించి ఆలోచించేలా  చేయడం చాలా కష్టం.అలా మా డైరెక్టర్ రాకేష్ గారు డిజైన్ చేశారు.ఈ సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే కథ, డ్రామా ఉంది ఈ సినిమాలో ఇలాంటి సినిమాలో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
 
చిత్ర హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..మా చిత్ర టీజర్ రిలీజ్ చేసిన తరువాత ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ చూసి చాలా మంది ఈ సినిమాను ఫ్యామిలీ తో చూడచ్చా అని అడుగుతున్నారు.అయితే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో కలసి వచ్చి చూసేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు.
 
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.. ఈ సినిమాలో మాయారే  అనే ఒకే ఒక సాంగ్ చేశాను. ఈ సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శిరీష్ తో ముందు ముందు ఫుల్ ఆల్బమ్ చేస్తాను. నాకిలాంటి  మంచి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి ధన్యవాదాలు అన్నారు.
 
చిత్ర సంగీత దర్శకుడు అచ్చు రాజమణి మాట్లాడుతూ..ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన పాటలు ట్రెండింగ్ లో వున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా  ఈ సినిమా నుండి మంచి సింగర్స్ పాడిన మెలోడీ సాంగ్స్ రాబోతున్నాయి.ఈ పాటలు కూడా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ, శ్రీలీల ధమాకా మాస్ క్రాక‌ర్ వ‌చ్చేసింది