Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన సిబ్బందికి ఉచితంగా కరోనా టీకాలు వేయించిన బన్నీ

Webdunia
బుధవారం, 19 మే 2021 (20:05 IST)
టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఓ సాధారణ పౌరుడులాగానే ఉంటారు. బడా నిర్మాత అల్లు అర్జున్ కుమారుడన్న భావన ఆయనలో ఇసుమంత కూడా కనిపించదు. అలాగే, తన చుట్టూ పనిచేసేవారి బాగోగులను తన కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు. ఇందుకు నిదర్శనమే... తాజాగా, ఆయన తన సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. 
 
తన టీమ్‌లోని 45 ఏళ్లకు పైబడిన వారికి, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ డోసులు వేయించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అల్లు అర్జున్ స్వయంగా సమకూర్చి, పర్యవేక్షించారు. 
 
టాలీవుడ్ అగ్రహీరోల్లో సొంతంగా ఓ టీమ్‌ను కలిగివున్న వారిలో అల్లు అర్జున్ ఒకడు. వారి బాగోగుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు. తన టీమ్‌లోని అనేకమందికి పుట్టినరోజు వేడుకలను బన్నీ స్వయంగా నిర్వహిస్తుండడం తెలిసిందే. 
 
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల్లో తొలుత చిరంజీవి కరోనా వైరస్ బారినపడగా, ఆ తర్వాత నాగబాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ ఇలా వరుసగా ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments