Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అమర రాజా సంస్థ ఉచితంగా కోవిడ్ టీకాలు

ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు అమర రాజా సంస్థ ఉచితంగా కోవిడ్ టీకాలు
, బుధవారం, 5 మే 2021 (18:27 IST)
తిరుపతి: బాధ్యతాయుతమైన సంస్థగా సమాజానికి తిరిగి ప్రయోజనం చేకూర్చాలి అనే సిద్ధాంతానికి కట్టుబడి, అమర రాజా సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య సంరక్షణ సంస్థలు/ ఏజెన్సీలు/ పివిసిలతో భాగస్వామ్యం చేసుకుని 18 సం||ల వయస్సు పైబడిన ప్రతి ఉద్యోగికి తప్పకుండా ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉద్యోగుల ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంస్థ ఎల్లప్పుడూ  అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న ప్రజలందరికీ కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే అమర రాజా సంస్థ ఈ ప్రక్రియను ప్రారంబిస్తున్నది.
 
ఇదే అంశంపై అమర రాజా సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు వైస్ చైర్మన్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ, “ఈ కోవిడ్ మహమ్మారి రెండవ వేవ్ యొక్క ప్రభావం అంచనా వేయలేనంతగా మరింత తీవ్రరూపం దాల్చుతుందని వెల్లడించారు. దీనితోపాటు, ఈ ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడటానికి ప్రభుత్వం చేస్తున్న  కృషిని ప్రశంసిచారు మరియు ఇదే దిశగా సంస్థగా మా వంతు చేయగలిగినంత కృషి చేయాలనుకుంటున్నాము.

ఈ పరిస్థితులలో,  ప్రతి ఒక్కరూ త్వరగా టీకాలు వేయించుకోవడం ఎంతో అవసరం అని దృఢంగా నమ్ముతూ, ఇందులో భాగంగానే  మా ప్రతి ఉద్యోగి మరియు వారి కుటుంబ సభ్యులకు టీకాలు వేయించే ఈ సమిష్టి ప్రక్రియను మేము చేపడుతున్నాము. భవిష్యత్తులో, అవసరం వచ్చినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని మా వంతు బాధ్యతను నిర్వహిస్తామని తెలిపారు. ”మహమ్మారికి ముందు, గతంలో కూడా, అమర రాజా సంస్థ వారి ఉద్యోగులు మరియు ఇతర వాటాదారుల ప్రయోజనం కోసం ఇటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది అని తెలియచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కర్ఫ్యూ .. దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసులు రద్దు...