Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' లేటెస్ట్ అప్ డేట్స్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం ద్వారా రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఈ సినిమాని రామ‌ల‌క్

Webdunia
శనివారం, 14 ఏప్రియల్ 2018 (11:02 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా". ఈ చిత్రం ద్వారా రైట‌ర్ వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఈ సినిమాని రామ‌ల‌క్ష్మీసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. బ‌న్నీ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టించింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది.
 
ఈ చిత్రంలోని ఓ పాట‌ను ఈరోజు చిత్ర నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్, ఆయ‌న స‌తీమ‌ణి శిరీషా శ్రీధ‌ర్ సంయుక్తంగా రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ మాట్లాడుతూ... ఈ సినిమాతో బ‌న్నీ సెన్సేష‌న‌ల్ స్టైలీష్ స్టార్ అవుతాడని గ‌ట్టి న‌మ్మ‌కం. బ‌న్నీ తెలుగు సూప‌ర్ స్టార్ మాత్ర‌మే కాదు మ‌ల‌యాళంలో చాలా క్రేజ్ ఉంది. 
 
ఈ సినిమాని త‌మిళంలో డ‌బ్ చేస్తున్నాం. సో.. త‌మిళ్ ఆడియ‌న్స్‌ను కూడా ఆక‌ట్టుకుని బ‌న్నీ అక్క‌డ కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. హిందీ డ‌బ్బింగ్ కూడా జ‌రుగుతోంది. స‌రైనోడు హిందీ డ‌బ్బింగ్ మూవీ యూట్యూబ్‌లో ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నార్త్ ఇండియాలో కూడా బ‌న్నీకి ఆద‌ర‌ణ ఉంది కాబ‌ట్టి ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్‌ని కూడా రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. 
 
నాలుగు భాష‌ల్లోను ఒకేసారి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈనెల 20న సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి 22న‌ ఆడియో రిలీజ్ చేయాల‌నుకుంటున్నాం. ఇక  29న హైద‌రాబాద్‌లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ప్లాన్ చేస్తున్నాం. మే 4న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments