Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ.. ఆ డైరెక్ట‌ర్‌కి హ్యాండ్ ఇచ్చాడా..?

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:58 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో క‌థ‌ల విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. చాలా క‌థ‌లు విని ఆఖ‌రికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ క‌థ‌ను ఓకే చెప్ప‌డం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సుకుమార్‌తో సినిమా, వేణు శ్రీరామ్‌తో ఐకాన్ మూవీ... మొత్తం మూడు సినిమాలు ఓకే చేయ‌డంతో ఫ్యాన్స్ తెగ సంతోషప‌డ్డారు.
 
కానీ ఇపుడు... ఆయన భారీ ప్లాన్‌కి బ్రేకులు పడ్డాయి అని వార్త‌లు వ‌స్తున్నాయి. తన సినిమా మొదలుపెట్టకుండా.. మరోటి ఓకే చేసేందుకు సుకుమార్‌ ససేమిరా అన్నాడు. సుకుమార్‌ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలల్లో లాంచ్‌ చేయాలి. దానికి తోడు త్రివిక్రమ్‌ సినిమా పూర్తి చేయాలి. సో... త్రివిక్రమ్‌ తీస్తున్న అల వైకుంఠాపురంలో.. డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి, జనవరి నుంచి సుకుమార్‌ సినిమాని ఫుల్‌ రేంజ్‌లో మొదలుపెట్టాలి.
 
ఈ లెక్కన ఐకాన్‌ సినిమాకి ఇపుడు షూటింగ్‌ కుదరదు. ఈ విషయాన్ని దిల్ రాజుకి, వేణు శ్రీరామ్‌కి ఆల్రెడీ చెప్పేశాడట బ‌న్నీ. పైగా వేణు శ్రీరామ్‌ సినిమాకి భారీ బడ్జెట్‌ కావాలట. అంత బడ్జెట్‌తో హడావుడిగా సినిమా చేస్తే అసలుకే మోసం వస్తుంది. సో.. ఆ సినిమాని తర్వాత టేకప్‌ చేద్దామని బన్నీ పక్కన పెట్టాడు. ఇంకా చెప్పాలంటే... ఈ డైరెక్ట‌ర్ కి బ‌న్నీ హ్యాండిచ్చాడు అని ఫిల్మ్ న‌గ‌ర్‌లో జ‌నాలు చెప్పుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments