Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూయార్క్‌లో సందడే సందడి.. తగ్గేదేలె అంటున్న అల్లు అర్జున్...

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (12:14 IST)
"పుష్ప" చిత్రంతో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఐకాన్ స్టార్ అయిపోయారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. తాజాగా అల్లు అర్జున తన భార్య స్నేహా రెడ్డితో కలిసి న్యూయార్క్ నగరంలో సందడి చేశారు. అక్కడ భారత సంతతికి చెందిన ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఈ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గ్రాండ్ మార్షల్ అవార్డుతో బన్నీని సత్కరించారు. అలాగే, న్యూయార్క్ మేయర్ ఆడమ్స్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని భారత సంతతి ప్రజలంతా కలిసి ఇండియా డే పరేడ్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనికి భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని చేత్తో పట్టుకుని రెపరెపలాండించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అల్లు అర్జున్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. 
 
అల్లు అర్జున్‌కు ‘గ్రాండ్ మార్షల్’ అవార్డును ఇచ్చి అక్కడి వారు సత్కరించారు. తనకు గ్రాండ్ మార్షల్ అవార్డును ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపాడు. సినిమా, వినోద ప్రపంచానికి అందించిన సేవలకుగాను ఈ గౌరవాన్ని అందించారు. ద ఫెడరేషన్ ఆఫ్ న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ కనెక్టికట్ సంయుక్తంగా 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర సంబరాలను నిర్వహించాయి.
 
ఇక అల్లు అర్జున్ న్యూయార్క్ పర్యటనలో ప్రత్యేకత ఏమిటంటే.. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ కలసి "పుష్ప" మాదిరిగా తగ్గేదేలే అన్న సంకేతంగా గడ్డం కింద చేయి పెట్టుకుని ఫొటోలకు పోజు లిచ్చారు. 'న్యూయార్క్ మేయర్ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో ఉత్సాహంగా ఉండే జెంటిల్ మ్యాన్. ఈ గౌరవం చూపించిన మిస్టర్ ఎరిక్ ఆడమ్స్‌కు ధన్యవాదాలు. తగ్గేదేలే!' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

ACP: హీరోయిజం ఇంట్లో.. బయటకాదు.. ఓవర్ చేస్తే తోక కట్ చేస్తాం: ఏసీపీ (Video)

Telangana: 14 ఏళ్ల బాలిక స్కూల్ బిల్డింగ్ నుంచి పడిపోయింది.. చివరికి?

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments