ఓవర్‌సీస్ మార్కెట్‌ను బాగా క్యాష్ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చ
ఓవర్‌సీస్ మార్కెట్‌ను బాగా క్యాష్ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. టీజర్ విడుదలలో డివైడ్ టాక్ రావడంతో దాన్ని బాగా పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. చిత్రీకరణ 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ దుబాయిలో అబుదాబిలో జరుగుతోంది.
అక్కడ అల్లు అర్జున్, పూజ హెగ్డేలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల్లో అల్లు అర్జున్ వేయబోయే స్టెప్స్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్ అబుదాబి సెట్స్‌లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని బంపరాఫర్ కూడా ప్రకటించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.