Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్ 'నాంది' ఫిబ్ర‌వ‌రి 19

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (18:39 IST)
Allari naresh, navami, Nandi
అల్లరి నరేష్ పూర్తి భిన్న‌మైన, ఒక ఉద్వేగ‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషిస్తున్న చిత్రం 'నాంది'. ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యి, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.
 
ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ శుక్ర‌వారం రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. బ్యాగ్రౌండ్‌ను బ్లాక్ క‌ల‌ర్‌లో డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్‌లో జైలుగ‌ది లోప‌ల కూర్చొని ఆలోచిస్తున్న అల్ల‌రి న‌రేష్ క‌నిపిస్తున్నారు. గ‌డ్డం పెంచుకొని ఉన్న న‌రేష్‌ను చూస్తుంటేనే ఇది ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కూ పోషించిన క్యారెక్ట‌ర్ల‌కు పూర్తి భిన్న‌మైన క్యారెక్ట‌ర్‌ను పోషించార‌ని అర్థ‌మ‌వుతోంది.
 
ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన స్టిల్స్ కానీ, పోస్ట‌ర్లు కానీ నాంది సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తినీ, అంచ‌నాల‌నూ పెంచుతూ వ‌చ్చాయి. వాటికి ల‌భించిన స్పంద‌న‌తో చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్య‌క్తం చేస్తోంది. నిర్మాత సతీష్ వేగేశ్న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
 
తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, న‌వ‌మి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్ర‌సాద్‌, విన‌య్ వ‌ర్మ‌, సి.ఎల్‌. న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, ర‌మేష్‌రెడ్డి, చ‌క్ర‌పాణి, రాజ్య‌ల‌క్ష్మి, మ‌ణిచంద‌న‌, ప్ర‌మోదిని, గ్రిగ్నేశ్వర రావు.
 
సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
బ్యాన‌ర్‌: ఎస్‌వి2 ఎంట‌ర్‌టైన్‌మెంట్
లైన్ ప్రొడ్యూస‌ర్‌: రాజేష్ దండా
సినిమాటోగ్ర‌ఫీ: సిద్‌
ఆర్ట్‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
క‌థ‌: తూమ్ వెంక‌ట్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణి
ఫైట్స్‌: వెంక‌ట్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ డ్రెస్ కోడ్.. తెల్లటి చొక్కా, ఖాకీ ప్యాంటు కాదు.. తెల్లటి కుర్తా, నల్ల ప్యాంట్

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments