Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమెడియన్ పృధ్వీ దూల తీరింది... అల్లరి నరేష్‌కు టెన్షన్ పట్టుకుంది... ఎందుకు?

నటుడు అల్లరి నరేష్‌ ఎప్పుడూ సరదాగా వుంటూ నలుగురితో జోకులేస్తూవుండేవాడు. కానీ ప్రస్తుతం చాలా టెన్షన్‌గా కన్పిస్తున్నాడు. గతంలో వున్నంత తేజస్సు ఆయనలో లోపించినట్లు కన్పిస్తుంది. తెరపై అల్లరి చేసేవాళ్ళు ఎక్కువవడం.. కమేడియన్లు హీరోలుగా మారడం ఇప్పటి ట్రెండ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:01 IST)
నటుడు అల్లరి నరేష్‌ ఎప్పుడూ సరదాగా వుంటూ నలుగురితో జోకులేస్తూవుండేవాడు. కానీ ప్రస్తుతం చాలా టెన్షన్‌గా కన్పిస్తున్నాడు. గతంలో వున్నంత తేజస్సు ఆయనలో లోపించినట్లు కన్పిస్తుంది. తెరపై అల్లరి చేసేవాళ్ళు ఎక్కువవడం.. కమేడియన్లు హీరోలుగా మారడం ఇప్పటి ట్రెండ్‌గా మారింది. మరోవైపు అల్లరి నరేష్‌ సినిమాలు పెద్దగా సక్సెస్‌కు నోచుకోకపోవడం కించిత్‌ బాధను కూడా తెచ్చిపెడుతుంది. 
 
ఇటీవలే పృథ్వీ హీరోగా నటిస్తున్న సినిమా ఫంక్షన్‌లో కమేడియన్‌ హీరో అయ్యాడు.. ఇక మాకు పోటీగా వస్తున్నాడంటూ.. స్టేట్‌మెంట్‌, సెటైర్‌ వేసినా.. అంతర్లీనంగా కాస్త టెన్షన్‌ వుండింది. ప్రస్తుతం నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' అనే పేరుతో వస్తున్నా.. లోలోపల భయపడుతున్నట్లు కన్పిస్తుంది. ఈ చిత్ర విజయం తనకు పెద్ద పరీక్షగా సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. 
 
అంతకుముందు సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ వంటి సినిమాలతో నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌హిట్‌గా నిలిచింది. ఇది హ్యాట్రిక్‌గా వుంటుందని భావిస్తున్నాడు. ప్రమోషన్‌లో భాగంగా మంగళవారంనాడు రేడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సిగరెట్‌ తాగుతూ టెన్షన్‌గా కన్పించారు. పిచ్చాపాటి మాట్లాడుతూ... విడుదలకు ముందు ఇలాంటి టెన్షన్‌ మామూలే.. తెరపై చాలా సరదాగా కన్పిస్తున్నా.. మనిషిగా వుండే టెన్షన్‌ వుంటుందని తెలిపాడు. కాగా పృధ్వీ మాత్రం తనకు ఎప్పటినుంచో తీరని దూల తన సినిమాతో తీరిపోయిందంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments