Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా చిత్రం ఆ ఒక్కటి అడక్కు అప్ డేట్

డీవీ
గురువారం, 11 ఏప్రియల్ 2024 (15:00 IST)
Allari Naresh - Faria Abdullah
కామెడీ కింగ్ అల్లరి నరేష్, కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో, చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.
 
టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ  'ఆ ఒక్కటి అడక్కు' ఏపీ, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ వేసవిలో సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్ చేస్తారు.
 
ఇప్పటికే విడుదల టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం తగిన వినోదాన్ని అందిస్తుందని, ఇందులో లీడ్ పెయిర్ మహ్ద్య అందమైన ప్రేమకథ కూడా ఉంటుందని టీజర్  ప్రామిస్ చేస్తోంది.
 
ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రాఫర్ కాగా, గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments