Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫారియా అబ్దుల్లా ను ఓహ్ మేడమ్. అంటూ సొంగ్ తో పలకరిస్తున్న అల్లరి నరేష్

Advertiesment
Faria Abdullah -  Allari Naresh

డీవీ

, మంగళవారం, 5 మార్చి 2024 (18:52 IST)
Faria Abdullah - Allari Naresh
అల్లరి నరేష్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ 'ఆ ఒక్కటీ అడక్కు'. మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాత. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈరోజు లీడ్ పెయిర్-  అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా పై చిత్రీకరించిన ఫస్ట్ సింగిల్ ఓహ్ మేడమ్‌ను విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ పాటని లాంచ్ చేశారు.
 
మనసుని హత్తుకునే మెలోడీ నంబర్స్ స్కోర్ చేయడంలో స్పెషలిస్ట్ అయిన గోపీ సుందర్ ఎనర్జిటిక్ మెలోడీని అందించాడు. లిరిసిస్ట్ భాస్కరభట్ల కథానాయకుడిలోని భావాలను అద్భుతంగా వ్యక్తం చేశారు. అనురాగ్ కులకర్ణి తన ప్లజెంట్ వోకల్స్ తో మ్యాజిక్ చేశాడు. మొత్తంగా, ఈ పాట ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతుంది.
 
అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లాల జోడి తెరపై ఫ్రెష్ గా కనిపించింది. అల్లరి నరేష్ ఆమెతో ఫ్లర్ట్ చేస్తుండగా, ఆమె అతని కంపెనీని ఆనందిస్తుంది.
 
వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం.
 
అబ్బూరి రవి రైటర్, సూర్య డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
 
మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా, ఆ ఒక్కటీ అడక్కు మార్చి 22, 2024న విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ సినిమా ఓ సంఘటన ఆధారంగా గోదావరి అందాలతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ : రవితేజ, సత్యరాజ్