Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బంగారు బుల్లోడు'గా అల్లరి నరేష్.. జనవరిలో రిలీజ్

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (17:09 IST)
అల్ల‌రి న‌రేష్ హీరోగా గిరి పాలిక ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ 'బంగారు బుల్లోడు'. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా పూజా ఝ‌వేరి న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.
 
2021 జ‌న‌వ‌రిలో 'బంగారు బుల్లోడు'ను విడుద‌ల చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఓ మాస్ సాంగ్‌లో డాన్స్ చేస్తున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూర్చిన ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ది. చిత్రంలోని పాట‌ల‌న్నింటినీ రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు.
 
అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో ఓ చ‌క్క‌ని హాస్య‌భ‌రిత చిత్రంగా 'బంగారు బుల్లోడు' పేరు తెచ్చుకుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. టాలీవుడ్‌లోని ప‌లువురు పేరుపొందిన హాస్య‌న‌టులు ఈ చిత్రంలో న‌టించార‌నీ, వారిపై చిత్రీక‌రించిన ప‌లు స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్వుకునేలా చేస్తాయ‌నీ చెప్పారు.
 
స‌తీష్ ముత్యాల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, అజ‌య్ సుంక‌ర స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
 
తారాగ‌ణం:
అల్ల‌రి న‌రేష్‌, పూజా ఝ‌వేరి, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, పృథ్వీ, ప్ర‌వీణ్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యం రాజేష్‌, ప్ర‌భాస్ శ్రీ‌ను, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్‌, అనంత్‌, భ‌ద్రం, అజ‌య్ ఘోష్‌, సారిక రామ‌చంద్ర‌రావు, రామ‌ప‌త్ర నిత్ర వెలిగొండ శ్రీ‌నివాస్‌.
 
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గిరి పాలిక‌
నిర్మాత‌: సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
బ్యాన‌ర్‌: ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి
స‌హ నిర్మాత‌: అజ‌య్ సుంక‌ర‌
మ్యూజిక్‌: సాయి కార్తీక్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌తీష్ ముత్యాల‌
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి
ఎడిటింగ్‌: ఎం.ఆర్‌. వ‌ర్మ‌
ఆర్ట్‌: ఎన్‌. గాంధీ
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
కో-డైరెక్ట‌ర్‌: ప్ర‌సాద్ దాసం
పీఆర్వో - వంశీ శేఖర్ 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments