Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనవరిలో పాయల్ రాజ్‌పుత్ '5Ws' విడుదల!

జనవరిలో పాయల్ రాజ్‌పుత్ '5Ws' విడుదల!
, సోమవారం, 21 డిశెంబరు 2020 (14:50 IST)
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా '5Ws - who, what, when, where, why' (5 డబ్ల్యూస్ - ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు?). సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు... అనేది ఉపశీర్షిక. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ "ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు పేరు తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు.
 
సాంకేతిక వర్గం వివరాలు:
దర్శకుడు: ప్రణదీప్ ఠాకోర్ 
నిర్మాత: శ్రీమతి యశోదా ఠాకోర్
నిర్మాణ సంస్థ: కైవల్య క్రియేషన్స్
ఛాయాగ్రహణం: అనిల్ బండారి
సంగీతం: మహతి సాగర్
సౌండ్ డిజైనర్: జె.ఆర్. ఎతిరాజ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
స్టంట్స్: వెంకట్
ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నాయర్
డైలాగ్స్, అడిషినల్ స్క్రీన్ ప్లే: తయనిధి శివకుమార్
స్టిల్స్:ఎ. దాస్
పబ్లిసిటీ డిజైనర్: రమాకాంత్
వీఎఫ్ఎక్స్: అలగర్‌సామి మయాన్, ప్రదీప్ పూడి
పీఆర్వో: నాయుడు సురేంద్రకుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ప్రకాష్ జోసెఫ్, రమేష్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: శరద్ వాఘ్రే
ప్రొడక్షన్ కంట్రోలర్: శ్రీనివాస్ కమ్మెల
కాస్ట్యూమ్స్: శ్రీను కనుమోలు
మేకప్: కోటి లకావత్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయితో పోటీపడుతున్న సురేఖా వాణి... నెట్టింట ఫోటోలు వైరల్