Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ "చెప్పినా ఎవరూ నమ్మరు"

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
, బుధవారం, 16 డిశెంబరు 2020 (17:52 IST)
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై  ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం. మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న "చెప్పినా ఎవరూ నమ్మరు". ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 1న విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబరులో పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
 
ఈ సందర్భంగా ఈ చిత్రంలో హీరోగా నటించి... దర్శకత్వం వహిస్తున్న ఆర్యాన్ కృష్ణ మాట్లాడుతూ, నిర్మాత ఈ చిత్ర నిర్మాణానికి బాగా సహకరించారు. సినిమా బాగా వచ్చింది. ఈ చిత్రం విజయంతో భవిష్యత్తులో కూడా ఆయన మరిన్ని మంచి చిత్రాలు చేయాలి. ఈ చిత్రాన్ని గోవా, హైదరాబాద్‌లలో రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీ రాలేదు, కామెడీ థ్రిల్లర్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే మా చిత్రం అందరికీ తప్పక నచ్చుతుంది. 
 
కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలుకుతూ సినీ ప్రేక్షకులకు కొత్త సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేస్తున్నాం. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు భయపడాల్సిన అవసరం లేదు. థియేటర్ వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా చూసి అందరి దీవెనలు మా టీంకు వుండాలని కొరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. 
 
చిత్ర నిర్మాత ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ, మా బ్యానరులో నిర్మిస్తున్న "చెప్పినా ఎవరు నమ్మరు". ఈ సినిమాలో న్యాచురల్ సీన్స్ ఉంటాయి. అన్నపూర్ణ స్టూడెంట్ అయిన మా అబ్బాయిని హీరోగా పెట్టి నిర్మించాను. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 1న మీడియా మాక్స్ శ్రీనివాస్ సపోర్టుతో విడుదల చేస్తున్నాం. మా బ్యానరులో మరిన్ని సినిమాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకుంటామని ఆశిస్తున్నట్టు తెలిపారు.
 
డిస్ట్రిబ్యూటర్ మీడియా మాక్స్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది చిన్న సినిమా కాదు దీనికి మూడు కోట్లు ఖర్చు పెట్టారు నిర్మాతలు. ఈ సినిమాను అన్ని రాష్ట్రాల్లో 300కు పైగా థియేటర్లలో విడుదల చేస్తాం. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో జనవరి 1న మీ ముందుకు వస్తామని అన్నారు.
 
ఇందులో నటించిన విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్‌లు మాట్లాడుతూ, ఈ సినిమాలో మాకు ఇంత మంచి రోల్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
 
తారాగణం:
ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి, విజయేందర్, రాకేష్ తదితరులు 
 
సాంకేతిక విభాగం: 
 
బ్యానర్: శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్
నిర్మాత: ఎం. మురళి శ్రీనివాసులు
డైరెక్టర్: ఆర్యన్ కృష్ణ
సినిమాటోగ్రఫీ: బురన్ షేక్, అఖిల్ వల్లూరి
సంగీతం: జగ్దీద్ వేముల
ఎడిటర్: అనకల లోకేష్
లిరిక్స్: భాస్కరభట్ల
రీ రికార్డింగ్: ప్రజావాల్ క్రిష్
పి. ఆర్. ఓ: మధు వి.ఆర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగ‌రంగ వైభవంగా "అందరూ బాగుండాలి - అందులోనేనుండాలి" ప్రారంభం