Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'118' ద‌ర్శ‌కుడు కేవి గుహన్ కొత్త చిత్రం 'డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ'

Advertiesment
'118' ద‌ర్శ‌కుడు కేవి గుహన్ కొత్త చిత్రం 'డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ'
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:43 IST)
'118' వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ త‌న త‌దుప‌రి చిత్రంగా మ‌రో డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'డ‌బ్లూడ‌బ్లూడ‌బ్లూ' (హూ, వేర్‌, వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ద‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో ఈ చిత్రం టైటిల్‌లోగోను విడుద‌ల‌చేయ‌నున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు ద‌ట్ల మాట్లాడుతూ, 'కేవి గుహ‌న్ తెర‌కెక్కించిన '118' మూవీ ఎంత‌పెద్ద హిట్ అయ్యిందో మ‌నంద‌రికీ తెలుసు. ఇప్పుడు ఆయ‌న రెండో చిత్రంగా ఒక డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సిమ‌న్ కె. కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా మిర్చి కిర‌ణ్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ అందిస్తున్నారు. టెక్నిక‌ల్‌గా మంచి టీమ్ కుదిరింది. త్వ‌ర‌లోనే టైటిల్ లోగోని విడుద‌ల‌చేస్తాం' అని చెప్పుకొచ్చారు. 
 
అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌, ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌, కొరియోగ్ర‌ఫి: ప్రే మ్ ర‌క్షిత్ మాస్ట‌ర్, కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దట్ల‌, నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు ద‌ట్ల, క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లావణ్య త్రిపాఠి పుట్టినరోజు.. 'చావు కబురు చల్లగా' పోస్టర్ రిలీజ్