Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ముందే మౌర్యతో ఫస్ట్ నైట్.. రెండు గంటల గ్యాప్‌లోనే.. అలీ కామెంట్స్

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (12:14 IST)
Ali
అలీతో సరదాగా షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ షోకు సెలెబ్రెటీలు స్పెషల్ గెస్టులుగా వచ్చి వారి సినీ, వ్యక్తిగత వివరాలను షేర్ చేసుకుంటుంటారు. ఆల్ రౌండర్‌గా నటుడిగా మంచి పేరు కొట్టేసిన అలీ నిర్మాతగా ఎదిగాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమా నటులు నరేశ్, పవిత్రా లోకేశ్‌లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు ఆలీ. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యాడు. ఒక సందర్భంలో భార్య పక్కన ఉండగానే వేరే అమ్మాయితో ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చిందని ఈ షోలో చెప్పడం సంచలనంగా మారింది. 
 
మూడు దశాబ్దాల పాటు ఎందరో కమెడియన్లు వచ్చినా.. అలీ మాత్రం స్టార్ సెలెబ్రిటీ గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా నరేష్-పవిత్రా లోకేష్‌తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను కూడా చెప్పేశాడు. 
 
తాను ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా మౌర్యతో ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చింది. అదే రోజు మా మ్యారేజ్ డే. అయితే డైరెక్టర్ తన భార్య, పిల్లలను షూటింగ్ స్పాట్‌కు తీసుకొచ్చి తనతో కేక్ కట్ చేయించారు. ఆ తరువాత వారు అక్కడే ఉండగానే ఫస్ట్ నైట్ సీన్ చేయాల్సి వచ్చింది. వాళ్ల ముందు ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీలయ్యాయని చెప్పుకొచ్చాడు. 
 
దీంతో నరేశ్ కల్పించుకొని 'నువ్వు ఒరిజినల్ ఫస్ట్ నైట్ షూటింగ్ గ్యాప్ లోనే ముగించేశావట కదా.. నిజమేనా..?' అని అడిగాడు. అలీ వెంటనే స్పందిస్తూ.. "నిజమే.. నేను ముద్దుల ప్రియుడు షూటింగ్‌లో ఉండగా మ్యారేజ్ అయింది.. ఆ తరువాత రాఘవేంద్రరావు గారు వెంటనే రమ్మనడంతో భార్య, అమ్మను తీసుకొని హైదరాబాద్‌కు వచ్చాను. షూటింగ్‌లో రెండు గంటల గ్యాప్ దొరికింది. ఈ సమయంలోనే ఫస్ట్ నైట్ జరిగింది.." అని ఆలీ చెప్పాడు. ప్రస్తుతం కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments