Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా' సాంగ్..

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (13:51 IST)
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో.. ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ కానుంది. అయితే, ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి 'సామ‌జవ‌ర‌గ‌మ‌నా, రాములో రాములా..' అనే పాటలను విడుదల చేశారు. 
 
క్లాసికల్ మ్యూజిక్‌కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి ఎస్.ఎస్. థమన్ స్వరపర‌చిన 'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా' సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాట 7 లక్షలకి పైగా లైక్స్ ను యూట్యూబ్‌లో దక్కించుకుంది. తెలుగులో ఓ పాట‌కి ఇన్ని లైక్స్ రావ‌డం ఇదే తొలిసారి.
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ యూరప్‌లో సాగుతోంది. అక్క‌డ బ‌న్నీ లిడో డాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులేసారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ఎంతో ఫేమ‌స్ అయిన లిడో డాన్స్‌ని బ‌న్నీ చేయ‌డంతో తాజాగా ఆయ‌న ఖాతాలో మ‌రో రికార్డ్ న‌మోదైంది. 
 
ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా అల్లు అర్జున్ గుర్తింపు పొంద‌డం విశేషం. కాగా, ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments